భారత మాజీ ప్రధాన మంత్రి ఆర్థికవేత్త అయిన డాక్టర్  మన్మోహన్‌ సింగ్‌కు ఎస్పీజీ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) భద్రత తొలగించారు.  రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్‌ సింగ్‌ గతవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం దేశ ప్రజలకు తెలిసిన విషయమే.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు భద్రతను తొలగించారంటూ తెగ ఇదైపోయారు. మాజీ ప్రధాని, అందులోనూ విధానసభలో సభ్యులైన మన్మోహన్ సింగే భద్రతను కుదించారు.అలాంటిది చంద్రబాబు ఈ భద్రత కుదింపు అంశంపై ప్రజల్లో సింపతి కొట్టేయాలని తెగ గింజుకుపోయారు. విమానాశ్రయంలో తమ నాయకుడికి అవమానం జరిగిపోయిందంటూ పెడబొబ్బలు తెలుగు తముళ్ళు ఇంకా ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైకాపా నేతలు మండిపడుతున్నారు.




ఇప్పటికీ ఏ మాత్రం అవకాశం దొరికిన గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ప్రధానమంత్రి భద్రత కుదింపుతో పచ్చ తమ్ముళ్ల కళ్ళు తెరుచుకుంటాయో చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే..మన్మోహన్‌ భద్రతను ఎస్పీజీ నుంచి జడ్‌ ప్లస్‌కు కేంద్ర ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి మన్మోహన్‌కు సీఆర్పీఎఫ్‌ బలగాలు రక్షణగా ఉండనున్నాయి.




మన్మోహన్‌ భద్రతపై అన్ని భద్రతా సంస్థల నుంచి నివేదిక తీసుకున్న తర్వాతనే ఆయనకు భద్రతను కుదించామని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ తెలిపింది. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగిన మన్మోహన్‌కు ఇప్పటి వరకు ఎస్పీజీ భద్రత పర్యవేక్షణలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా దేశంలో  ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రత కొనసాగుతుండడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: