ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది, ఎంపీలు ముగ్గురు ఎవరు ఎప్పుడు సైకిల్ దిగుతారో తెలియని పరిస్థితి. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ కూడా చెమటలు పట్టిస్తుంది. క్లుప్తంగా టిడిపి పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ లో సమరోత్సాహం నింపడానికి పార్టీని పూర్వ వైభవం దిశగా నడిపించడానికి ఒక చరిష్మ గల నేత కావాలన్న చర్చ తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నడుస్తున్న ఈ డిస్కషన్ కేంద్ర బిందువు జూనియర్ ఎన్టీఆర్.



జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అటు చూస్తే టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ కావాలన్న డిమాండ్ చర్చ రెండు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిన్నల్లుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని తేల్చేశారు. భరత్ బాలకృష్ణ చిన్నల్లుడే కావచ్చు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి తోడల్లుడే కావచ్చు. కానీ ఫ్యామిలీని పక్కన బెట్టి పొలిటికల్ యాంగిల్ లో చూస్తే భారత్ రాజకీయాలకు కొత్త విశాఖ ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలైన నేత.



అంటే అలాంటి భరత్ జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పడం, అది కూడా సింగిల్ డైలాగ్ స్టేట్ మెంట్ తరహాలో కాకుండా కాస్త వివరంగా నాన్ స్టాప్ గా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని వివరించే ప్రయత్నం చేయడం పార్టీలో చర్చ నీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో మళ్లీ యాక్టివ్ కావాలని పార్టీలో ఒక వర్గం బలంగా కోరుకుంటుందట. టిడిపితో సంబంధం లేకుండా నందమూరి కుటుంబంలో కూడా కొందరు అదే అభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలో కీలకమైన వర్గం ఎంతలా వ్యతిరేకిస్తుందో చెప్పడానికి భరత్ కామెంట్స్ ఉదాహరణ అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.



జూనియర్ ఎన్టీఆర్ వస్తే నెమ్మదిగా పార్టీ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తారన్న భావనతో ఉన్న వర్గం అసలు ఆయన అవసరమే లేదని ఎక్స్ పోజ్ చేసే పనిలో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు లోకేశ్ కి, భరత్ కి మధ్య ఉన్న గ్యాప్ కూడా తొలగిపోయిందని టిడిపిలో డిస్కషన్ నడుస్తుంది. అదే సమయంలో టీడీపీలో కీలక వర్గం తనపై వ్యతిరేకతతో ఉందన్న విషయం తెలిసే ఎన్నికల వేళ పార్టీకి ప్రచారం చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. పార్టీ చరిత్రలోనే లేనంతగా సంక్ష్యోభంలోకి కూరుకుపోతున్న వేళ కూడా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్న కామెంట్స్ స్వయంగా బాలకృష్ణ చిన్నల్లుడే చేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: