ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఇప్పుడు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతీ తెలిసిందే. అయితే సీబీఐకి చిదంబరం అసలు సహకరించడం లేదని తెలుస్తుంది. ప్రశ్నలు అడుగుతుంటే .. నాకేమి తెలియదని .. చదివి చెబుతానని ఇలా సమయాన్ని వృధా చేస్తున్నాడని పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. ఈ విధంగా చిదంబరం పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఈ కేసులో విదేశాల నుంచి అక్రమంగా డబ్బును ఐఎన్ఎక్స్ మీడియాలోకి పంపించారని ప్రధాన ఆరోపణ. అయితే చిదంబరం 2017 నుంచి అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ఎన్నో స్టే లు తెచ్చుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు.


స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు.  ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. 


చిదంబరం అరెస్ట్ వెనుక అమిత్ షా ప్రతికారం ఉందని కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రముఖంగా వస్తున్న సంగతీ తెలిసిందే. అప్పట్లో చిదంబరం కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి .. జైల్లో వేయించారు. దీనితో అమిత్ షా ఇప్పుడు అధికారంలో ఉండటంతో అది కూడా కీలకమైన హోమ్ మినిస్టర్ హోదాలో ఉండటంతో చిదంబరంను అరెస్ట్ చేయించి ప్రతి కారం తీర్చుకున్నాడని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: