టికెట్ లేని ప్రయాణం నేరం అనే సంగతి అందరికి తెలుసు.  తెలిసిన కానీ కొంతమంది కావాలని పట్టుకుంటే అప్పుడు చూద్దాంలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ప్రయాణాలు చేస్తుంటారు.  ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ఎంత నష్టపోవలసి వస్తుందో చెప్పక్కర్లేదు.  ప్రభుత్వం ఇలా ప్రయాణం చేసే వారి వలన ఎంతగానో నష్టపోతున్నది.  


ముఖ్యంగా రైల్వే.  రైల్వే ప్రయాణికులు నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాది కనీసం వెయ్యికోట్ల దాకా నష్ట పోతున్నది.  అందుకోసమే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది.  ఎలాగైనా సరే టికెట్ లేని ప్రయాణికులను అదుపుచేయాలని అనుకుంది.  గతంలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే.. టికెట్ ఫీజుతో పాటు అదనంగా రూ. 250 ఫైన్ వేసేవారు. ఇలా ఫైన్ రూపంలో దాదాపు రూ. 1377 కోట్లు కట్టారు.  


ఇది ఏ ఒక్కరో కట్టింది కాదు.. రైల్లో ప్రయాణం చేస్తూ కట్టిన ఫైన్ మొత్తం ఇది. 2016 నుంచి 2019 వ సంవత్సరం వరకు వసూలైన ఫైన్ ఇది. అయితే, ఇది కొన్ని రైల్లో మాత్రమే వేసింది. ఇలా వందలాది మంది టికెట్ లేకుండా రైల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు తనిఖీలు విస్తృతం చేసింది.  తనిఖీలు మమ్మురం చేయడం వలన అలాంటి ప్రయాణికులను పెట్టుకోవచ్చని ప్రభుత్వం చూస్తున్నది.  


ఇందులో భాగంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నది.  ఇకపై ఫైన్ కు కూడా పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది.  ఈ ఫైన్ ను పంచడం వలన.. రాబడి పెరగడంతో పాటు.. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జేబులకు చిల్లులు పడటం ఖాయం అని అంటున్నారు.  ఇలా జేబులకు చిల్లులు పడకూడదు అనుకుంటే.. టికెట్ కొని ప్రయాణం చేయాలి.  అప్పుడే అంతా సవ్యంగా ఉంటుంది.  ఒకవేళ టికెట్ లేకుండా ప్రయాణం చేసి.. డబ్బు కట్టని పక్షంలో ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: