జి 7 సదస్సు ఫ్రాన్స్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సదస్సులో జి 7 దేశాలతో పాటు కొన్ని ఇతర దేశాలు కూడా పాల్గొన్నాయి.  ఆయా దేశాల అధ్యక్షుల పిలుపు మేరకు ఆయా ఆదేశాలు ఆ సదస్సులో పాల్గొన్నాయి.  అక్కడి వచ్చి తమ బాధక సాధకాలు చెప్పుకుంటున్నాయి.  ఈ సదస్సులో ట్రంప్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.  ట్రంప్ హడావుడి చివరి వరకు కనిపించింది. 


అయితే, సోమవారం ట్రంప్ కు ఊహించని దెబ్బ తగిలింది.  ట్రంప్ శత్రువు ఇరాన్ దేశానికీ చెందిన విదేశాంగ మంత్రి ఆ సదస్సులో సందడి చేశారు.  ఇది అమెరికాకు తీరని దెబ్బ అని చెప్పాలి. ఇరాన్ కు.. అమెరికాకు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  అణుఒప్పందం రద్దు తరువాత వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  


అంతేకాదు,  ఇరాన్ పై ఆంక్షలు విధించారు.  గల్ఫ్ లో చమురు విషయంలో కూడా రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఇది ఇద్దరికి మంచిది కాదనే సంగతి తెలిసిందే.  గల్ఫ్ లో అమెరికాకు చెందిన డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసింది.  తమ జలాల్లోకి ప్రవేశించిందని చెప్పి డ్రోన్ ను కూల్చివేసింది.  దీంతో అమెరికా మరింత కోపగించుకుంది.  ఓ దశలో యుద్దానికి రెడీఅయ్యింది.  ఇరాక్ విషయంలో చేసిన తప్పును తలచుకొని వెనక్కి తగ్గింది.  


యుద్దాలు చేసి చేసి అమెరికా ఎంతో లాస్ అయ్యింది.  యుద్ధం వలన వచ్చింది ఏమి లేదు.  అందుకే యుద్ధం వద్దని పక్కన పెట్టింది.  ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రి వరసగా వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు.  జి 7 దేశాల సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడికి అయన కృతజ్ఞతలు తెలిపారు.  ఫ్రాన్స్ తో పాటు జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల నాయకులతో అయన చర్చలు జరిపారు.   చర్చలు జరిపేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అయన తెలిపారు.  అమెరికా మాత్రం దీన్ని ఖండిస్తోంది.  అమెరికాకు అవమానం జరిగినట్టుగా భావించింది.  మరి ఇరాన్ విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: