ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం ఈజీ అయ్యింది.. నెల తిరిగే సరికి జీతం చేతికి వస్తుంది.. టెక్నాలిజీ అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అలానే వస్తున్నాయి.  ఆదాయం ఎక్కువగా ఉంటోంది.  ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని సేవింగ్స్ రూపంలో వెనకేసుకుంటున్నారు.  కదలకుండా కూర్చొని చేసే పనులు కాబట్టి పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  


ఇక వ్యాపారం విషయానికి వస్తే.. వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొద్దిగా స్మార్ట్ గా కష్టపడితే.. డబ్బులు పుష్కలంగా వస్తాయి.  డబ్బును పెట్టుబడిగా అలా పెట్టిన దాని వెనక్కి తెచ్చుకోగలిగినపుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది.  ఎవరో ఏదో చెప్పారని నమ్మి పెట్టుబడిగా పెడితే.. చివరకు మిగిలేది చేతికి చిప్పే.. అందుకే బిజినెస్ రంగంలోకి దిగేటప్పుడు ఒకటికి పదిసార్లు అలోచించి పెట్టుబడి పెట్టాలి.  చేయగలమా లేదా అని ఆలోచించాలి.  


ఈ రెండు సేఫ్ జోన్ లో ఉండే ఆదాయ మార్గాలు.  అయితే, సేఫ్ లేని ఉద్యోగం ఒకటి ఉన్నది.  అదే రైతు ఉద్యోగం.  రైతులు పొలంలోకి దిగి జీతం లేని ఉద్యోగిగా కష్టపడతాడు.  అలా రేయింబవళ్లు కష్టపడినా పంట చేతికి వస్తుందా అంటే చెప్పలేం.. వచ్చినా మంచి ధర పలుకుతుందా అంటే అదికూడా చెప్పలేము.  అందుకే రైతు చేసే ఉద్యోగం ఎప్పటికి సేఫ్ కాదు.  కానీ రైతుకు పొలం పనులు తప్పించి మరొకటి తెలియదు.  ఇక పురుగుమందులను పొలంలో చల్లి రైతులు చాలా నష్టపోతున్నారు.  కొన్ని పురుగుమందులు పురుగులను చంపకపోవడంతో పాపం రైతులు అవే పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. 


ఇందుకు భిన్నంగా కొంతమంది రైతులు ఆలోచిస్తున్నారు.  మాములుగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేయాలి అంటే.. ఖర్చు కూడుకొని ఉంటుంది.  కొంచెం వినూత్నంగా ఆలోచిస్తే.. ఖర్చు వీలైనంతగా తగ్గించుకోవచ్చు.  అదెలా అంటే.. పొలంలో సేంద్రియ ఎరువును తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చులో ఎక్కవ ఖర్చు నల్లబెల్లమే.  ఈ బెల్లం కేజీ 70 నుంచి 100 రూపాయలు పలుకుతుంది.  అందుకే దీనికి బదులుగా బాగా పండిన తాటికాయలను వినియోగించవచ్చు.  


అదెలా అంటే, బాగా పండిన తాటికాయల పై పీచును తీసి, లోపల ఉన్న గుజ్జుతో కూడిన పీచును ఒక డ్రమ్ లో వేయండి.. అనంతరం ఆ డ్రమ్ము నిండా నీరు నింపాలి.  ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రమ్ములోని నీటిని కలియబెడుతూ ఉంటె.. డ్రమ్ములో ఉన్న పీచు తెల్లగా మారుతుంది.  నీరు పసుపు రంగులోకి వస్తుంది.  ఈ నీటిని నిద్రియ ఎరువుగా వాడికోవచ్చు.  ఈ నీటిని పంటపై పిచికారీ చేయడం వలన తేనెటీగలు, ఇతర పురుగులు రావు.  ఇది లాభసాటి వ్యాపారమే.  ఇలా తయారు చేసుకున్న సేంద్రియ నీరు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: