టచ్ ఫోన్స్ ఎప్పుడైతే మార్కెట్‌ల్లోకి వచ్చాయో అప్పటినుండి ప్రపంచం పోకడనే మారిపోయింది.అరచేతి నుండే అందాలను తిలకించవచ్చు,అమ్మాయిలతో చాటింగ్ చేయ వచ్చు,దొంగతనాలు,సైబర్ నేరాలు,ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది.వయస్సుతో తేడా లేదు.టచ్ ఫోన్ వుంటే చాలు,అన్నీ టచ్ చేయవచ్చు అను కుంటున్నారు ఇనాటి జనం.ఆ టచ్ ఫోన్ తోనే ఒకడు ఆంటీని టచ్ చేసి చాలా కొల్లగొట్టాడు.ఆ మ్యాటరేంటో తెలుసుకుందాం పదండి.




మొహమ్మద్ సల్మాన్ నవాజ్ సర్కార్ (32) అనే మాయగాడు,మధ్య వయసు మహిళలను ఎంచుకుని,ఫేస్‌బుక్ ద్వారా వల వేస్తాడు.తానో పేరు మోసిన బిజినెస్ మ్యాన్‌గా బిల్డప్ ఇస్తూ తనను తాను పరిచయం చేసుకుని మెల్లిగా నమ్మించి, తర్వాత తన అసలు నైజం బయటపెడతాడు.మహిళలకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలను తన అకౌంట్లలోకి బదిలీ చేయించుకుంటాడు.అడిగినంత ఇవ్వకపోతే బండారం బయట పెడతానంటూ బెదిరించి,వేధింపులకు గురిచేస్తాడు. చెన్నై కేంద్రంగా పెద్దింటి మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టుచేసి, వివరాలు తెలిపారు.




2018 జనవరిలో సల్మాన్,బాధిత మహిళకు ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా..బాధిత మహిళ యాక్సెప్ట్ చేసినట్లు, తాను ముంబైలో పేరు మోసిన వ్యాపారస్థుడినని చెప్పుకున్న నిందితుడు..ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించే పనిలో ఉన్నట్లు బాధితురాలిని నమ్మించాడు.అనతి కాలంలోనే వీరి పరిచయం ఛాటింగ్‌లు,వీడియో కాలింగులకు వరకు వెళ్లింది.ఇద్దరి మధ్య చనువు పెరగడంతో నిందితుడు అడగ్గానే..బాధితురాలు తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఆ తర్వాత వ్యాపార పనులు,వైద్య చికిత్స అని,సాకులు చెప్పి నిందితుడు ఆమె నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశాడు.



కొన్ని రోజులకు ఆమెకు అనుమానం వచ్చి డబ్బులు పంపించడం ఆపేయగానే..బెదిరింపుల పర్వం మొదలుపెట్టాడు.అడిగి నంత ఇవ్వకపోతే బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.అప్పటికే తనవద్ద నుంచి
రూ.12,96, 000 తీసుకున్నమాయగాడు ఇంకా వేధించడంతో చేసేదేం లేక సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసు లను ఆశ్రయించారట.మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి,సోషల్ మీడియా నెటవర్క్‌ల ను పరిశీలించి,నిందితుడు హైదరాబాద్ వాసి కాదని..చెన్నై కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నాడని గ్రహించి, అక్కడి వెళ్లి అరెస్టు చేశారట.ఇక పోలీసుల విచారణలో నిందితుడు సల్మాన్ తన నేరాన్ని అంగీక రించాడు.నిందితుడు మధ్య వయసు మహిళలను ఎంచుకొని వారిని తెలివిగా మోసం చేసి,సులువుగా డబ్బులు సంపాదించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: