రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. వీటి వివరాలు సరైన సమయంలో బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పేర్కొన్నారు. టీడీపీ మాజీ నేత రాజధానిలో భూములు లేవంటున్నారని, భూములపై సవాలు చేస్తే తాను చూపిస్తానని పేర్కొన్నారు.


అయితే మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేసింది మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సవాల్ కు సుజనౌ చౌదరి కూడా దీటుగా స్పందించారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన తనకు 29 గ్రామాల పరిధిలో ఎక్కడ భూమలు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. ఆయన రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి పరిశీలించారు.


వేల కోట్ల రూపాయల ప్రజాధనం రాజధాని కోసం వెచ్చించారంటున్న సుజనా చౌదరి.. ఇపుడు ఇక్కడ రాజధాని లేదనటం సరికాదన్నారు. ప్రస్తుతం అమరావతి చూస్తుంటే దయ్యాల నగరంలా కనిపిస్తోందని సుజనా అన్నారు.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదన్నారు. గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నీ వైఎస్ కొనసాగించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ కూడా అమరావతి నిర్మాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు.


నాకు రాజధానిలో భూములు ఉన్నాయని బొత్స చెబుతున్నారు... 29 గ్రామాల పరిధిలో భూములు ఉంటే అవి ఆయనకు రాసిస్తా.. అంటూ సుజనా చౌదరి సవాల్ విసిరారు. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ ఇక్కడ భూములు లేవని తేల్చి చెప్పారు. మరి అడిగితే ఆధారాలు చూపిస్తా అన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఏం చేస్తారు.. ఆధారాలు చూపిస్తారా.. లేక.. కామ్ గా విషయం దాటేస్తారా.. బొత్స సత్యనారాయణ ఆధారాలు బయటపెడితే మాత్రం రాజకీయం రంజుగా మారడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: