గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసారన్న విషయం తెలిసిందే.సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం చేపట్టిన ఇన్విజిలేటర్ల ఎంపికపై ఇప్పుడు దుమారం రేగుతోంది.వాస్తవానికి ఇన్విజిలేటర్ల ఎంపిక రాండమ్‌గా చేపడతారు.ఎవరికి ఏ సెంటర్‌ను కెటాయిస్తారో పరీక్ష ముందు రోజు వరకు తెలియదు.అలాంటిది ఈ సెలక్షన్ బహిర్గతమైందని వస్తున్న విషయం వివిధ సోషల్‌ మీడియా గ్రూపుల్లో అలజడి సృష్టిస్తోంది.ఏ ఇన్విజిలేటర్‌కు ఏ కేంద్రం కేటాయించారో అందులో స్పష్టంగా ఉందని.దీంతో ఈ పరీక్షల్లో గోల్‌మాల్‌ తప్పదనే ప్రచారం ఊపందుకుంది.ఇది ఫేక్ న్యూస్ అనితెలిసి కూడ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.



ఇక ముందుగానే ఇన్విజిలేటర్‌కు ఫలానా కేంద్రం కేటాయించినట్టు బహిర్గతం అయితే అవకతవకలకు పాల్పడే ఆస్కారం వుంటుందని,ముందు రోజు వరకు వారికి కూడా కేంద్రాలపై సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించారు.కానీ ఇప్పుడు టీచర్ల గ్రూపులతో పాటు అనేక సోషల్‌ నెట్‌వర్కులలో ఓ జాబితా హల్‌చల్‌ చేస్తోంది.అది అసలైన జాబితానా? లేక బోగస్‌ జాబితానా? అన్నది విద్యా శాఖ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.ఈ విషయమై డీఈవోను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు.



ఇదిలావుండగా ఆ జాబితా ఆధారంగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు పైరవీలకు పాల్పడుతున్నారు.ఈ పరీక్షలో ఇన్విజిలేటర్ల సహకారంతో నెగ్గాలని ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపికకు ఇంటర్వ్యూలు కూడా లేకపోవడంతో ఎలాగైనా పరీక్షలో నెగ్గాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారికి ఈ జాబితా ఓ వరంలా కనిపిస్తోంది.కాని పట్టు బట్టి పాస్ అవ్వాలని కష్టపడి చదువుకున్న అభ్యర్ధులకు మాత్రం ఈ లీకేజి సంఘటన  తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.కాబట్టి ఇది ఎంతవరకు నిజమో త్వరగా అధికారులు తేల్చుతే కాస్త ఊపిరైన పీల్చుకోవచ్చనుకుంటున్నారు అభ్యర్దులు...


మరింత సమాచారం తెలుసుకోండి: