రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న తరుణంలో.. విభజనకు కారణమవుతున్న పార్టీలపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తున్న తరుణంలో..ఏదో విధంగా విభజన అపవాదును తప్పించుకోవాలని అనుకొంటోంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకూ తాను సమైక్యవాద పార్టీని అని టీడీపీ ప్రకటించుకోలేదు. ఈ పార్టీ అధినేత స్వయంగా తాము విభజనకు అనుకూలంగా ఉన్నామనిప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు మాత్రం తాము సమైక్యవాదులం అని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య వాదుల ఆగ్రహావేశాలు తమకు తగలకుండా చూసుకొంటున్నారు ఈ నేతలు! అయితేవీరు గట్టిగా సమైక్యవాదులం అనే పరిస్థితి లేదు! అందుకే మధ్యే మార్గంగా విభజనను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ప్రక్రియను ఐదు నెలలవరకు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. ఆ తరువాత అసెంబ్లీలో విభన బిల్లు పెట్టి మెజార్టీ సభ్యులు అభిప్రాయం మేరకే విభజన జరగాలని ఆయన అన్నాడు. కేంద్ర ప్రభుత్వ చర్యలన్నీ కేవలం తెలుగు దేశం పార్టీని ఇబ్బంది పెట్టటానికేనని ఆయన విమర్శించాడు. అయితే విభజనే జరగకూడదని అనాల్సింది పోయి.. ఇలా విభజనను వాయిదా వేయాలి.. ఐదునెలల తర్వాత జరగాలి అనే మాటలు తెలుగుదేశం పార్టీకి కొత్తగా తెచ్చిపెట్టేది ఉండడేమో! తెలుగు రాష్ట్రాన్ని పాలించడంలోతమ ముద్రను వేసిన తెలుగుదేశం వాళ్లు సమైక్యాంధ్రకు జై కొట్టి ఆ పరిస్థితులే వేరేగా ఉండేవి! అలాంటిసువర్ణాకవకాశాన్ని టీడీపీ ఏనాడో కోల్పయింది. ఇప్పుడు ఏం మాట్లాడి ఏం ప్రయోజనం?!    

మరింత సమాచారం తెలుసుకోండి: