కోడెల శివప్రసాద్ .. ఫర్నిచర్ దొంగతనం కేసులో తప్పించుకునేందుకు ఫర్నిచర్ ను వెనక్కి ఇచ్చేస్తాని ఇప్పటీకే స్టేట్ మెంట్ ఇచ్చారు. దొరికిన తరువాత దొంగ అంత కంటే ఇంకేమి చెప్పగలడు. అయితే కోడెల ముందు జాగ్రత్తగా కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. నా దగ్గర ఉన్న ఫర్నిచర్ ను వచ్చి ప్రభుత్వం తీసుకెళ్లొచ్చని .. అయితే తప్పు ఒప్పుకున్నా .. ఒప్పుకోకపోయిన కోడెల దొంగతనం చేసినట్టే .. దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే ! అయితే టీడీపీ అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే కోడెల మళ్ళీ స్పీకర్ స్థానంలో చేతివాటం ఇంకా ఎక్కువయ్యేది. అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు కూడా నమోదు చేసారు.


సెక్షన్ 409 కింద .. సెక్షన్ 414 కింద కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 414 అంటే ఏదైనా ప్రొపెర్టీని దొంగతనం చేస్తే ఈ సెక్షన్ కేసు నమోదు అవుతుంది. చివరికి మాజీ స్పీకర్ కోడెల ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. .అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.


అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో ! అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా ! అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: