ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్యల్లో ఒకటి అమెజాన్ అడవి ముప్పు.  ఈ ముప్పు కారణంగా ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్న అడవుల్లో కార్చిచ్చు షరా మామూలే.  అయితే, అడవికి అంటుకున్న ఆ నిమ్ము కోద్దీప్రాంతం వరకే ఉండేది.  కానీ, ఇప్పుడు అడవికి అంటుకున్న నిప్పు ఆగేలా లేదు.  అడవిని సమూలంగా దహించివేసే వరకు ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ ఊపిరితిత్తులు తగలబడి పోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి వివిధ దేశాలు.  


ఇలా అడవికి మంటలు అంటుకోవడం వలన కేవలం ఆ దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఇబ్బందే అనే సంగతి అందరికి తెలుసు.  నివారణ చర్యలు తీసుకోవాలి.  కానీ, ఇప్పటి వరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారో అర్ధం కావడం లేదు.  అడవులు తగలబడి పోతున్నా పట్టించుకోవడం లేదు అక్కడి ప్రభుత్వం అదేమంటే ఏమి చేయలేమంటూ చేతులు ఎత్తేస్తోంది.  ఇదే తరహా ముప్పు ఇప్పుడు చెన్నై కు కూడా భవిష్యత్తులో ఉండబోతుందని అంటున్నారు.  


ఎందుకంటే.. చైన్నై నగరం రోజు రోజు విస్తరిస్తోంది.  చెన్నైకు ఒకవైపు మొత్తం సముద్రమే ఉన్నది.  మరోవైపు ఇతర ప్రాంతాలు ఉన్నాయి.  నగరం విస్తరణ కోసం అడవులను కొట్టేస్తున్నారు.  చెట్లను నరికేస్తున్నారు.  ఇలా చేయడం వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  ఇటీవలే ఆ నగరం నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పక్కర్లేదు.  మొన్న వచ్చింది కేవలం శాంపిల్ మాత్రమే.  ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.  


ప్రతి సంవత్సరం 4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం చెన్నైకు తీరని దెబ్బగా మారింది. వచ్చే ఏడాది కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  గ్రౌండ్ వాటర్ ఇప్పటికే కరువైంది.  ఎక్కడా కొద్దిగా కూడా నీరు దొరకని పరిస్థితి.  ఈ పరిస్థితి ఇంకొన్నాళ్ళు కొనసాగితే.. చెన్నైకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు అంటున్నారు.  ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం చెన్నైని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటే మంచిది.  లేదంటే మాత్రం చెన్నై కనుమరుగైపోవడం ఖాయం.  ఒక్క చెన్నై నగరమే కాదు.. అటు లండన్, న్యూయార్క్, షాంగై నగరాలు ఇలాంటి ముప్పును ఎదుర్కొంటామని అంటున్నారు నిపుణులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: