వైసీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పోలవరం విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. గత టీడీపీ ప్రభుత్వం పోలవరంలో అవినీతికి పాల్పడిందని, ఎక్కువ ధరలకు కాంట్రాక్టరులకు పనులు అప్పగించారని ఆరోపిస్తూ..ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. నవయుగకు ఇచ్చిన పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుని రద్దు చేసింది. అలాగే ప్రధాన డ్యామ్ పనులని ఆపేసి.. ఆ కాంట్రాక్టరుని తప్పించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది.


అయితే వైసీపీ తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు టీడీపీకి గానీ, అటు బీజేపీగానీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్రమంత్రి షెకావత్ కూడా జగన్ ప్రభుత్వానికి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇలా చేస్తే ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతాయని చెప్పారు. కానీ అవేం పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం తన పని తాను చేసేసుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వానికి నవయుగ కాంట్రాక్టుని రద్దు చేసే విషయంలో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. నవయుగ హైకోర్టుని ఆశ్రయించడంతో కాంట్రాక్టుని రద్దుని సస్పెండ్ చేస్తూ...వారినే పనుల్లో కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.


ఇక ప్రధాన్ డ్యామ్ పనుల విషయంలో బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం పెద్దలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లడాన్ని మంత్రి షెకావత్ తప్పుబడుతున్నారు. అటు పోలవరం అథారిటీ కూడా పనుల్లో జాప్యం జరిగే అవకాశముందని కేంద్రానికి నివేదికలు పంపుతోంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ పోలవరం విషయంలో మొండిగా ముందుకెళితే మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అలా అని తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ప్రభుత్వం పరువుపోతుంది. దీంతో ఈ విషయంపై జగన్ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.


తాజాగా కేంద్ర మంత్రి షెకావత్ తో ఏకాంతంగా భేటీ అయిన జగన్...పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళుతున్నామో పూర్తిగా వివరించారు. మళ్ళీ అధికారుల సమక్షంలో పోలవరంపై తన వాదనని మరోసారి వినిపించారు. అయితే ఇన్ని చెప్పిన షెకావత్ ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. మరి కేంద్రం జగన్ వాదనతో ఏకీభవిస్తుందో లేక వ్యతిరేకిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: