ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మునిసిపల్ మంత్రి చేసిన ప్రకటనతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. రాజధాని రైతుల్లో ప్రకంపణలు సృష్టించాయి. అయితే రాజధాని ప్రాంతం ముంపు ముంగిట్లో ఉందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. కానీ ఇతర పార్టీలన్నీ కూడా అమరావతి తోనే రాజధాని కొనసాగించాలని రైతులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతులు అన్ని పార్టీల నేతలను కలుసుకుని తమ బాధలు విన్నవించుకుంటున్నారు.


ప్రస్తుతం బీజేపీ నేతలు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో కన్నా మాట్లాడుతూ, మడమతిప్పం వెనక్కిబోమని చెప్పుకునేటువంటి నాయకులు చెప్పిన మాటకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి పూర్తిగా విరుద్ధంగా కనబడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అని ఆయన అన్నారు. గత నాలుగు మాసాల్లో అనేక విషయాల్లో కూడా ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కి వేస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అని కన్నా లక్ష్మీ నారాయణ చెప్తున్నారు.


నేను ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాన్ని అనేక ఉత్తరాలు ముఖ్యమంత్రికి ఇప్పటికే రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని కన్నా తెలిపారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఉత్తరం ఆయన రాసింది  రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో కూడా నేను అనేకమార్లు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు మీరొచ్చిన తర్వాతైనా దళితులకు న్యాయం చేయాలి అనేటువంటి మాట కూడా మొట్టమొదట తాను రాసినట్టు వంటి ఉత్తరం అని కాని, దానికి ముఖ్య మంత్రి దగ్గర నుంచి సమాధానం రాలేదని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువగా కనబడుతుంది కాని పని తక్కువ కనపడుతుంది అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. (


మరింత సమాచారం తెలుసుకోండి: