వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఎక్కడికెళ్లినా నీరాజనాలు పడుతున్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు హైదరాబాద్ కి  చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకి  పలువురు క్రీడాకారులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ ఈ విజయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పారు. అందరి దీవెనలతో టైటిల్ సొంతం చేసుకున్నానని చెప్పారు. తన తల్లిదండ్రుల సహకారం మరువలేదని, ఎంతో నిరీక్షణ తర్వాత బంగారు పతకం సాధించానన్నారు. గతంలో సెమీస్‌లో ఓడినప్పుడు సమీక్ష చేసుకున్నానని తెలిపారు. 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల సాకారమైందని, ప్రతిసారి ఒకే రకమైన గేమ్‌ప్లాన్‌ పనిచేయదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 

ఈ నేపథ్యంలో  భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజీకీయ ప్రముఖులు అందరూ సింధును అభినందిస్తున్నారు. అలాగే  సింధు చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌ కూడా సింధు స్వర్ణ పతకం సాధించడంపై ట్వీట్‌ చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు బంగారానివి సింధు అని ట్వీట్‌ చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు-మారిన్‌ తలపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో మారిన్‌ పసిడి గెలవగా..సింధు రజతాన్ని ముద్దాడింది. అప్పట్నుంచి పలు టోర్నీల్లో వీళ్లిద్దరూ తలపడ్డారు. కోర్టులో ప్రత్యర్థులైనప్పటికీ.. బయట చాలా మంచి స్నేహితులు.

సోమవారం రాత్రి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన స్వర్ణ పతకాన్ని సింధు మెడలో వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పారు.

ఎన్నో రోజులు తన నిరీక్షణ ఫలించిందని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అన్నారు. తనకు మద్దతిచ్చిన అందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. తల్లిదండ్రులు, కోచ్‌ గోపీచంద్‌కు సింధు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న ఆమె.. గోపీచంద్‌ అకాడమీలో మీడియాతో మాట్లాడారు.త్వరలో ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తానని చెప్పారు పీవీ సింధు. అనంతరం తిరిగి ప్రాక్టీస్ మొదలు పెడతానని తెలిపారు. దేశానికే గర్వకారణమని ప్రధానని తనను పొగడడం సంతోషంగా ఉన్నారు సింధు.



మరింత సమాచారం తెలుసుకోండి: