తమ్ముళ్ళ తీరు ఎలా ఉంటుందంటే తాము నంది అంటే అది నంది. పంది అంటే పంది. అతి పేద రాష్ట్రంగా విభజన తరువాత తయారైన నవ్యాంధ్ర విషయంలో కనీసం దయా దాక్షిణ్యం లేకుండా అయిదేళ్ళ పాటు వీలున్నంత మేర దోచుకున్నారు. ఇక అందరికీ పనికివచ్చే రాజధాని నిర్మించమంటే ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం రాజధాని అని అది కూడా భ్రమరావతి పేరిట  కలలు కల్పించి ఇపుడు దాన్ని ముట్టుకుంటే మాహాపాపం అన్నట్లుగా మీద పడిపోతున్నారు.


దీనిమీద మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ టీడీపీ మీద ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఏం అమరావతి ఒక్కటే బాగుపడాలా అంటూ బొత్స సూటిగా అడిగిన దానికి టీడీపీ దగ్గర సమాధానం ఉందా. ఏపీలో విశాఖపట్నం, కర్నూల్, తిరుపతి, రాజమండ్రి ఇవేమీ బాగుపడకూడదా, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగకూడదా అక్కడ భూములకు రేట్లు రాకూడదా అభివ్రుధ్ధి చెందకూడదా ఇవీ బొత్స వేసిన ప్రశ్నలు. మరి దీనికి టీడీపీ తమ్ముళ్ల వద్ద తగిన  సమాధానం ఉందా అంటే లేదనే చెప్పాలి.


ఇక చంద్రబాబు నాయుడు తీరు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 23 జిల్లాల ఏపీకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  విభజన తరువాత  ఆయన 13 జిల్లాలకు పరిమితం అయ్యారు. ఇక ఆయన సీఎం గా కేవలం రెండు జిల్లాల  సీఎం అని పేరు తెచ్చుకున్నారు, ఇపుడు ఆయన విపక్షంలోకి రావడానికి కారణం ఆ వివక్షే. అయినా ఇప్పటికీ మారని బాబు ఇంకా ఆ రెండు జిల్లాలే తనకు కావాలని అంటున్నారు. ఇప్పటికైనా ఏపీలోని పదమూడు జిల్లాల సమగ్ర అభివ్రుధ్ధి అంటూ ఆయన మాట్లాడకపోవడం బట్టీ చూస్తూంటే టీడీపీ  భారీ పరాజయం నుంచి బాబుతో సహా ఎవరికీ తగిన గుణపాఠం నేర్పలేదనే తెలుస్తోంది.


ఇదే విషయాన్ని బొత్స అడిగి మరీ కడిగి పారేశారు. ఏం ఏపీలోని వారంతా ప్రజలుగా  టీడీపీ వారికి కనిపించడం లేదా. ఎందుకంటే అమరావతిలో వేలాది ఎకరాలు దోచిపెట్టినందుకు అక్కడే బాగుపడాలని కోరుకుంటారా అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. మరి బొత్స అన్న మాటలకైనా  టీడీపీ నేతలు సరైన సమాధానం చెబుతారా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: