అనేక సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల తిరుపతి దేవష్తానం బోర్డ్ మెంబర్ గా నియమితులు అవుతారని ప్రచారంలో ఉంది. తెలంగాణా కోటాలో అయన్ని నియ‌మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ సరికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దిల్ రాజు అటు కేసీయార్ కి ఇటు జగన్ కూడా బాగా ఆప్తుడు కావడం విశేషం.


ఇదిలా ఉండగా తొందరలో టీటీడీ బోర్డ్ ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. తొందరలోనే బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నదున పూర్తి స్థాయి బోర్డు ఉంటే బాగుంటుందని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈసారి తెలంగాణాకు పెద్ద పీట వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణా నుంచి మై హోమ్స్  అధినేత జూపల్లి రామేశ్వరరావును కూడా జగన్ టీటీడీ మెంబర్ గా తీసుకుంటారని తెలుస్తోంది.


 మై హోమ్స్  అధినేతను చిన జీయర్ స్వామి కూడా రికమెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేందెర స్వామిజీ కూడా మరో తెలంగాణా ప్రముఖుడు పేరుని సిఫార్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వామి మాటను మన్నించి జగన్ ఆయన్ని కూడా టీటీడీ మెంబర్ గా తీసుకుంటారని  అంటున్నారు. 


మొత్తానికి చూస్తే గత చంద్రబాబు సర్కార్ లో తెలంగాణా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటే ఈసారి ఆ సంఖ్య మూడుకు పెరిగింది. మొత్తానికి టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా మరో పది మంది దాకా ఈసారి పెరుగుతారని అంటున్నారు. అందులో మోడీ, అమిత్ షా సిఫార్స్ చేసిన వారు కూడా ఉంటారని తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి కూడా భూమన కరుణాకరరెడ్డి వంటి వారికి అవకాశం ఉంటుందని అంటున్నారు.  వైసీపీలో పెద్ద జాబితాయే ఉంది. మరి జగన్ అందరికీ ఎలా ఇస్తారో కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: