సీనియర్ మంత్రి బొత్స  సత్యానారాయణ  ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. రాజధాని రైతుల నుంచి విపక్షాల వరకూ అంతా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం బొత్స కొద్ది రోజుల క్రితం రాజధాని మీద చేసిన వివాదాస్పద కామెంట్స్. అసలు ఆ రోజు మీడియా సమావేశంలో బొత్స చెప్పాల్సినవి వేరు. అవి చెప్పేసిన బొత్సను ఓ మీడియా ప్రతినిధి అడిగిన దానికి బొత్స ఇచ్చిన సమాధానం ఇంత కధను, రచ్చను చేసింది.


నిజానికి ఆ విలేకరి అడిగిన దానికి బొత్స సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి వూరుకుంటే పోయేది. అమరావతి రాజధానిపై ఏవేవో అనేసి మరీ పెద్ద కంపు చేశారు. రాజధాని వరదలు అంటూ ముడిపెడుతూ నిర్మాణాలు ఖర్చు, ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్న దాకా వెళ్ళిపోయారు. దాంతో గత కొన్ని రోజులుగా రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు.


నిజానికి జగన్ కి రాజధాని విషయంలో ఏవైనా చెప్పాలనుకుంటే చెబుతారు. మంత్రులందరూ కూడా ఆ విషయంలో  తలో విధంగా మాట్లాడడం వల్ల వైసీపీ సర్కార్ బదనాం అయింది. చివరకి ఈ అగ్గి ఏపీ అంతా రాజుకుంది. అసలే వరదల గొడవ ఓ వైపు. పోలవరం రచ్చ మరో వైపు, మధ్యలో అమరావతి మరో వైపు జగన్ అమెరికాలో ఉన్న టైంలో బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు నోరు జారడం వల్ల వచ్చిన తంటాగా భావిస్తున్నారు.


ఈ మొత్తం వ్యవహారం ఇపుడు జగన్ మెడకు చుట్టుకుంది. దాంతో జగన్ బొత్సపై సీరియస్ గా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. బొత్సకు కీలకమైన మునిసిపల్ శాఖను కేటాయించారు. అయితే ఆయనకు ఇపుడు  రాజధాని వివాదంతో ప్రమేయం లేని శాఖకు  మారుస్తారా  అన్నది చూడాల్సివుంది. మరి బొత్స దీని మీద ఇప్పటికీ తగ్గకుండా మాట్లాడుతుండడంతో జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలాగే మరో మహిళా మంత్రి మీద కూడా వేటు పడుతుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో కాదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: