ప్రతి దానికి రూపాయి కావాలి.  రూపాయి లేకుండా ఏ వస్తువు ఊరికే రాదు.  డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ మాటను రోజు టీవీలో చూస్తూనే ఉంటాం.  ఇప్పుడు ఆ రూపాయి ప్రజలను భయపెట్టేవిధంగా మారిపోతున్నది.  రూపాయి రోజురోజుకు బలహీన పడుతుండటం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందా అనే విధంగా మారిపోయింది.  అందుకోసమే రూపాయి కోసం చాలా భయపడుతున్నారు. రూపాయిని కాపాడుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  


ప్రపంచంలో ఆర్ధికమాధ్యం క్రమంగా పెరిగిపోతున్నది.  అప్పుడెప్పుడో 1991లో ఈ ఆర్ధిక మాధ్యం ప్రపంచాన్ని భయపెట్టింది.  ఆ తరువాత అన్ని దేశాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని ఆ విపత్తునుంచి తప్పించారు.  కానీ, ఇప్పుడు మరలా దాని కోరల్లో ప్రపంచం చిక్కుకోబోతున్నది.  ఆ సూచనలను ఇండియాలో కనిపిస్తున్నాయి.  ఇప్పటికే డాలర్ తో రూపాయి విలువ దారుణంగా దెబ్బతిన్నది. 


ఈ పరిస్థితి ఇంకా  కొనసాగుతున్నటుగా కనిపిస్తోంది.  తాజా సమాచారం ప్రకారం డాలర్ తో రూపాయి విలువ 71.90 గా ఉన్నది.  ఇది క్రమంగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.  ఈ స్థాయిలో రూపాయి పతనం కావడం అందరిని ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నది.  ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందుతుందని ఇటీవలే కేంద్రం బడ్జెట్ లో పేర్కొన్నది.  భారత ఆర్ధిక వ్యవస్థ ఐదు బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారబోతుందని చెప్పిన కొద్దిరోజులకే ఇలా ఇంతలా రూపాయి విలువ జారిపోవడం విశేషం.  


చూస్తుంటే ఈ రూపాయి బంగ్లాదేశ్ టాకా ను మించిపోయేలా ఉన్నది.  ప్రస్తుతం బంగ్లాదేశ్ టాకా డాలర్ తో 84.63గా ఉన్నది.  నిన్నటి కంటే టాకా విలువ పడిపోయింది.  రూపాయితో పోల్చుతుంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు.  ఇండియా రూపాయి విలువ ఇలా రోజు రోజుకు పడిపోతుంటే.. మన ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది కారంగా మారే అవకాశం ఉన్నది.  కాబట్టి వీలైనంత త్వరగా ఇండియా ఈ ఆర్ధిక వ్యవస్థ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఆర్ధికంగా బలంగా ఎదుగుతున్న క్రమంలో ఆర్ధిక మాద్యం వలన బలహీనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలా జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: