అమరావతి రాజధాని పేరు టీడీపీ హయాంలో ఏ రేంజిలో మోత మోగింది. తెల్లారి లేస్తే అనుకూల మీడియాలో గ్రాఫిక్స్ తో తెగ ప్రచారం చేసేవారు. ప్రపంచ రాజధాని అంటూ ఆర్భాటం అంతా ఇంతా కాదు. టీడీపీ అమరావతి అంటూ కలవరించినా కూడా అక్కడ జరిగిన అభివ్రుధ్ధి అంటూ పెద్దగా లేదన్నది అందరికీ తెలిసిందే. ఓ రాజధానిని నిర్మిస్తానని నవీన‌ యుగంలో పాలకులు పాకులాడడమే అసలైన విడ్డూరంగా అనిపించింది.


ఇదిలా ఉండగా అమరావతికి వాస్తు దోషం బాగా ఉందని వాస్తు నిపుణులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. అందుకే అమరావతి అనుకున్నంతగా ఎత్తిగిల్లడంలేదని, పైగా అనేక వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయని వారు అంటున్నారు అమరావతి ఇదే తీరున ఉంటే అభివ్రుధ్ధి చెందడం కష్టమని కూడా సెలవిస్తున్నారు. వాస్తు ప్రకారం చాలా మార్పులు చేర్పులు చేయాలని కూడా సూచిస్తున్నారు  ఇంతకీ అమరావతిలో ఉన్నదేంటి లేనిదేంటి అన్న దానిపై వాస్తు నిపుణులు అంటున్న మాటలు ఇలా ఉన్నాయి. ఉత్తరం నుంచి తూర్పు ఆగ్నేయం వరకూ క్రిష్ణా నది ఉందని, ఇందులో ముఖ్యంగా రాజధాని నగరానికి తూర్పులో ఈశాన్యం తగ్గి క్రిష్ణా నది ఆగ్నేయం వైపు పరుగులు పెడుతోందని వాస్తు పండితులు ప్రసాద్  అంటున్నారు.


అలాగే రాజధాని నగరానికి ఈశాన్యంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉందని చెప్పి కొంతమంది గత పాలకులను తప్పు దారిలో నడిపించారని కూడా వాస్తు నిపుణులు కూడా  చెబుతున్నారు. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తున్న  సమయంలో ఆ నగరానికి నాలుగు వైపులా స్థలం ఉండాలి, కానీ అమరావతి విషయంలో మాత్రం నది అవతల విజయవాడ అనే వ్యావహారిక నగరం ఉంది.  అందువల్ల  కేవలం వ్యాపార ద్రుక్పధంతోనే రాజధాని నిర్మాణానికి ఈ స్థలం ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఓ నగరానికి అతి ముఖ్యమైన  ధాతువు ఇసుక.



దీనిని ద్రుష్టిలో ఉంచుకుని  గత పాలకులు  వారి సైన్యాన్ని అర్ధికంగా బలోపేతం చేసుకోవడానికి సిధ్ధం అయ్యారని వాస్తు నిపుణులు అంటున్నారు.  శాస్త్ర ప్రకారం చూస్తే ఇది వారు చేసిన పెద్ద తప్పు అని ఖండితంగా చెప్పేస్తున్నారు. ఏ విధంగానూ ఇసుక దిబ్బల దగ్గర ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయరాదని వాస్తు నిపుణులు ప్రసాద్ సూచిస్తున్నారు. ఇక క్రిష్ణ నది గురించి పరిశీలిస్తే ఓ నది ద్వారా పొందాల్సిన ఆహార ధాన్యాలు, పంట ఉత్పత్తి పెరిగి అంతా సస్యశ్యామలంగా ఉండాలి. 


కానీ ఇక్కడ చూసుకుంటే రాజధాని నిర్మాణం పేరిట నాలుగు పంటలు పండే భూములను తీసుకుని ఏడారిగా మార్చేస్శారు. ఈ కారణంగా కూడా ఇది బీడు భూమిగా మారింది. అందువల్లనే ఈ ప్రాంతంలో ప్రక్రుతి విలయతాండవం చేస్తోందని, వరదల ముప్పు పొంచి వుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే వాస్తుదోషాలతో లోపభూయిష్టంగా అమరావతి రాజధాని స్థలం  ఎంపిక ఉందని వాస్తు పురుష ప్రసాద్ తెలియచేస్తున్నారు. మరి ఇన్ని లోపాలు ఉన్న అమరావతిని అక్కడ నుంచి మారుస్తే కానీ ఆంధులకు రాజధాని దక్కదేమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: