వ్యసనం ఒక్కసారి అలావాటైందంటే.. దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు.. ఎంత మంది చెప్పినా.. ఎన్ని దెబ్బలు తిన్నా.. మనసు ఆ వ్యసనంవైపే లాగుతుంటుంది. మారాలని ఆ మనిషి తనకు తాను అనుకుంటే తప్ప.. వారు మారరు. అలాంటి ఓ దొంగ కథే ఇది. ఈ దొంగ పేరు మోహ్‌సిన్ .. వయస్సు 22 ఏళ్లు.. నివాసం పాతబస్తీ యాఖుత్‌పురా పరిధి తలాబ్‌కట్టాలోని అమాన్‌నగర్‌-బీ ప్రాంతం.


ఈ మహమ్మద్‌ మోహ్‌సిన్‌ తండ్రి షకీల్‌తో కలిసి ఆజంపురాలోని సైఫా మసీదు సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చెడు సావాహాల కారణంగా .. రెండేళ్ల క్రితం జైలుపాలయ్యాడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో భవానీనగర్‌ ఠాణా పోలీసులు అరెస్ట్‌ చేసి మోహిన్‌ను జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ ఉంటే చెడిపోతాడని కుటుంబ సభ్యులు ఖతార్ పంపారు.


అక్కడా కుదురుగా ఉండని మోహ్‌సిన్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చేశాడు. విలాస జీవితానికి అలవాటై ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. డబ్బు కోసం ఫోన్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఒంటరిగా ఉండే వారిని ఎంచుకోవడం.. ఫోన్లు కొట్టేసి అమ్ముకోవడం ఇదో అలవాటుగా మారింది. ఈనెల 24న గంట వ్యవధిలోనే మూడు చోట్ల సెల్ ఫోన్లు కొట్టేశాడు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా మోహ్‌సిన్‌ను గుర్తించారు.


ఈనెల 24న ఉదయం 5:15 గంటల నుంచి 6:20 గంటల వ్యవధిలో అఫ్జల్‌గంజ్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట పోలీస్‌ ఠాణాల పరిధిలో ఈ ఫోన్ దొంగతనాలు చేశాడు మోహ్‌సిన్.. దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. మంగళవారం నిందితుడిని న్యాయస్థానానికి తరలించారు. ఎలాగూ పాత నేరస్తుడే కాబట్టి పట్టుకోవడం పోలీసులకు సులవైంది. 24 గంటల్లోనే అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: