వ్యాపార సంస్థల్లో ఈ రోజు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఆయా వాణిజ్య సంస్థల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామికవాడలోనూ, ముంబైలోనూ అగ్నిప్రమాదాలు జరిగాయి. దేంతో ఆయా వ్యాపార సంస్థ నిర్వాహకుల సొత్తు బుగ్గి పాలైంది.ఒకటి రసాయన కర్మాగారమైతే..ఇంకొకటి కల్ప వ్యాపార సంస్థ కావడం విశేషం. సంఘటన వివరాలను ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం. మంటలు ఎగసిపడుతుండడంతో చుట్టూ పక్కల ఉన్న పరిశ్రమదారులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. పెద్ద ఎత్తున ఎగసిపుడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి.





నగరంలోని మూడు ఫైర్ ఇంజన్లు సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అదే విధంగా ముంబై నగరంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో నగరంలో అగ్ని ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిపోయిందని చెప్పాలి. అయితే నగర శివారు ప్రాంతలో మాత్రం తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి,





ఆయా పరిశ్రమల్లో ఫీ ప్రికాషన్స్ తేసురుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే  ముంబైలోని మజ్‌గాం ప్రాంతంలోని ముస్తఫా బజార్ టింబరు యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్వేతామార్గ్ లో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు ఏకంగా ఎనిమిది  అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు,


మరింత సమాచారం తెలుసుకోండి: