ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి, 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఓకే ఒకడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడుకు ఘోరాతి ఘోరంగా ఓడించిన ధీరుడు, యువతకు స్ఫూర్తినిచ్చే యువకుడు, అవ్వాతాతలకు అండగా ఉండే మనవడు, కళ్ళు అరిగిల ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.                                                                                     


1996 ఆగష్టు 28 న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిలవివాహం జరిగింది. అంటే ఈరోజుకు ఖచ్చితంగా 23 సంవత్సరాలు అయ్యింది. దీంతో ఈరోజు వారి 23వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్ట్ సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేధికగా వారికీ వివాహా వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.                                                  


ఫేసుబుక్ లో పెళ్లినాటి చిత్రాన్ని షేర్ చేస్తూ 'అన్నయ వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు' అని ఫేసుబుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చుసిన వైఎస్ జగన్ అభిమానులు ఆ పెళ్లినాటి చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన మొదటి పెళ్లి రోజు కారణంగా నెటిజన్ల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెలువెళ్తున్నాయి.                                              


                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: