టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత మనిషి శారీరకంగా కష్టపడే రోజులు పోయాయి.  ఇప్పుడు మనిషి కేవలం బుద్దిని మాత్రమే ఉపయోగించి పనులు చేస్తున్నారు. బుద్ధికి తగ్గట్టుగా మనిషి టెక్నాలజీని తయారు చేస్తున్నారు.  ఇప్పుడు మనిషి ఒక చోట కూర్చొని తనకు కావాల్సిన పనులు అన్నింటిని ఆపరేట్ చేసుకుంటున్నాడు.  దీంతో మనిషికి పెద్దగా పనిలేకుండా పోయింది.  


అన్ని పనులు చేయడానికి తగిన విధంగా రోబోలు అందుబాటులోకి వచ్చాయి.  మనిషి చేసే ప్రతి పనిని ఆ రోబోలు చేస్తున్నాయి.  మనిషి కావాల్సిన అన్నీ సుఖాలను రోబోలు అందిస్తున్నాయి.  మెడికల్ రంగంలోను రోబోల సహాయం తీసుకుంటున్నారు.  క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి రోబోల సహకారం తప్పనిసరి అయ్యింది.  రక్షణ రంగంలోకి రోబోలను ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.  


తాజాగా అంతరిక్ష పరిశోధన కేంద్రం మీదకు రష్యా మొదటి హ్యుమానాయిడ్ రోబోను పంపింది.  ఈరొబో అక్కడ పనులను ప్రారంభించింది.  సొంతంగా ఆలోచించగల సమర్ధతను ఆ రోబో కలిగి ఉండటం విశేషం.  సొంతంగా ఆలోచించగలిగే పరిజ్ఞానం రోబోలకు వచ్చింది అంటే.. మనిషి మనుగడకు చెక్ పడినట్టు అవుతుంది. 


కేవలం మనిషి తన పనులను చక్కదిద్దుకోవడానికి మాత్రమే రోబోలను వినియోగించుకుంటున్నారు అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు రోజులను తన బెడ్ రూమ్ లలో సెక్స్ కోసం కూడా వాడుకుంటున్నారు.  అటువంటి రోబోలను జపాన్ తయారు చేస్తున్నది.  ప్రస్తుతం ఇవి ప్రయోగ దశలో ఉన్నాయి.  ఇవి సక్సెస్ అయితే మనిషి మరో మనిషితో పని ఉండదు. 

సృష్టి ధర్మాన్ని కూడా మిషన్ తో కానిచెయ్యడం అంటే అంతకంటే వినాశనం మరొకటి ఉండదు.  అదే చెప్తారు కదా వినాశకాలే విపరీత బుద్ధి అని.  ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే.. ప్రపంచ వినాశనానికి దారులు దగ్గర పడ్డాయా అనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: