వైసిపి నేతలు ప్రతిపక్షంలో ఉన్నపుడే చాలా యాక్టివగ్ గా ఉన్నారనే విషయం పై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వాళ్ళకు కూడా అదే అభిప్రాయం కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నపుడు రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగాయి. అందులో రాజధాని మార్చేస్తారని, అంతకుముందు వరదలు, కరకట్టపై చంద్రబాబునాయుడు ఇంటి ముణిగిపోవటంపై ప్రచారం లాంటివి అందరికీ తెలిసిందే.

 

పై అంశాలపై చంద్రబాబు అండ్ కో తో పాటు బిజెపి నేతలు కూడా చాలా పెద్ద రచ్చే చేశారు. దానికి తగ్గట్లే ఎల్లోమీడియా కూడా వాళ్ళకు మద్దతుగా నిలబడి వైసిపి ప్రభుత్వంపై బురదను బాగా పులిమేసింది. విచిత్రమేమిటంటే టిడిపి తరపున చంద్రబాబుతో సహా నేతలందరూ వరుసపెట్టి జగన్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియాకు కౌంటర్ గా మంత్రులు కానీ ఎంఎల్ఏలు, ఎంపిలు ఇతర నేతలు పెద్దగా స్పందించలేదు. వరదలపై టిడిపి అంత రచ్చ చేసినా వైసిపి తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఉండాల్సినంత స్పందన లేదన్నది వాస్తవం.

 

అలాగే రాజధాని అమరావతిని మార్చేస్తున్నారంటూ పనికట్టుకుని టిడిపి+ఎల్లోమీడియా విషప్రచారం చేస్తున్నా వైసిపి తరపున గట్టిగా  కౌంటర్ ఇచ్చే వాళ్ళే కరువయ్యారు. మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రకటనతోనే కంపంతా రేగింది కాబట్టి బొత్సా మాత్రమే కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఉండటానికి అంతమంది మంత్రులున్నా ఎవరు కూడా ఎందుకు బొత్సకు మద్దతుగా నిలబడలేదో అర్ధం కావటం లేదు.

 

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిర్ణయం కోర్టులో వీగిపోయింది. దానిపై చంద్రబాబు నుండి నేతల దాకా అందరూ రెచ్చిపోయారు జగన్ పై. కానీ వైసిపి నుండి మాత్రం స్పందన పెద్దగా లేదనే చెప్పాలి. చూస్తుంటే ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చుకునే బాధ్యత జగన్ కు మాత్రమే ఉందని మంత్రులు అనుకుంటున్నట్లు అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: