ప్రపంచ దేశాల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది.  ప్రపంచంలోని అగ్రదేశాలు ఇష్టం వచ్చినట్టు ఆయుధాలను సమకూర్చుకున్నాయి.  అంతేకాదు.. ఆయుధాల వ్యాపారంతో ఆర్ధికంగా పుంజుకున్నాయి.  దీంతో ప్రపంచంలోని దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి.  అమెరికా .. రష్యా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్టుగా ఆయుధాలు సమకూర్చుకున్నాయి.  ప్రపంచాన్ని ఈ రెండు దేశాలు శాసించే స్థాయికి ఎదిగాయి.  


అయితే, రష్యా పతనం తరువాత అమెరికా అనూహ్యంగా పుంజుకుంది.  అయితే, పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎంపికయ్యాక.. ఆ దేశం తిరిగి పుంజుకోడవం మొదలుపెట్టింది.  రక్షణ, స్పేస్ రంగాల్లో తిరిగి ఆధిపత్యం చెలాయించే దిశగా అడుగులు వేస్తున్నది.  గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాల్లో యుద్దాలు చేసి.. ఇప్పటికే చాలా వరకు లాస్ అయ్యింది.  ఇప్పుడు యుద్ధం అమెరికాకు భయం వేస్తున్నది.  అయినా తన స్థానాన్ని కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.  


రక్షణ శాఖకు లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్ ను కేటాయించింది.  ఒకప్పుడు రష్యా నుంచి ఎలా పోటీ ఏర్పడిందో.. ఇప్పుడు చైనా నుంచి అమెరికాకు అలాంటి పోటీ ఏర్పడే అవకాశం ఉన్నది.  రక్షణ రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నది.  గగన తలంలో రక్షణపై అమెరికా, రష్యాలు ఇప్పటికే ముందు ఉన్నాయి.  ఆ దేశాల మాదిరిగానే చైనాకూడా గగన తలంలో రక్షణకు సంబంధించిన వాటికోసం వేలాదికోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  


ఒకవైపు ఆర్ధికంగా ఎదుగుతూనే.. మరోవైపు ఇలా రక్షణ రంగానికి సంబంధించి ఖర్చు చేస్తుండటంతో అమెరికాకు ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.  చైనాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఇందులో భాగంగానేవాణిజ్య విభాగంపై సుంకాలు విధించాలని చూసింది.  దాంతో చైనా ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టొచ్చు అన్నది అమెరికా వాదన.  అయితే, తన పట్టును కోల్పోకూడదు అని చెప్పి అమెరికా.. ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ కు దగ్గర అవుతున్నది.  భారత్ కు అని విధాలుగా సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నది.  భవిష్యత్తు యుద్దాలు వస్తే.. రోబోటిక్ టెక్నాలజీతో యుద్దాలు చేయడం ఖాయం అని చెప్పొచ్చు.  అప్పుడు ప్రపంచంలో మిగిలేది శవాల గుట్టలు.. బూడిద తప్పా మరేమి మిగలదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: