తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి ఏర్పాటుకు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌... ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి టీటీడీ పాల‌క మండ‌లి ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వెలువడుతున్నాయి. టీటీడీ పాల‌క మండ‌లి ఏర్పాటు చేసేందుకు ఈ సాయంత్రంలోగా ఉత్త‌ర్వులు వెలువ‌డ వ‌చ్చ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. 


టీటీడీ చైర్మ‌న్‌గా ఏపీ సీఎం జ‌గ‌న్ బంధువు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గ‌తంలోనే నియ‌మితుల‌య్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించిన సీఎం జ‌గ‌న్ అప్పుడు పూర్తి స్థాయి పాల‌క మండ‌లిని నియ‌మించ‌లేదు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌క‌పోవడంతో టీటీడీ పాల‌క మండ‌లి ఏర్పాటు ఆల‌స్య‌మైంది. కేవ‌లం ఒక్క చైర్మ‌న్ ను నియ‌మించిన సీఎం ఆల‌స్యంగానైనా పూర్తిస్థాయి పాల‌క మండ‌లి ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆశావాహుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.


టీటీడీ పాల‌క మండ‌లి 25మందితో ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఎవ‌రెవ‌రికి అవ‌కాశం వ‌స్తుందోననే ఉత్కంఠ ఇప్పుడు అంత‌టా నెల‌కొంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం టీటీడీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రికి అవ‌కాశం ఇచ్చారు. టీటీడీ పాల‌క మండ‌లిలో త‌న అనుయాయుల‌తో నింప‌నున్నాడ‌ట వైసీపీ పాల‌కులు. పాలకమండలి సభ్యులుగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ .. అలాగే ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను నియమించే అవకాశం ఉంది.


స్థానిక ఎమ్మెల్యే కోటలో భూమన, చెవిరెడ్డికి చోటు కల్పించనున్నారు. ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌‌కు పాలకమండలిలో చోటు కల్పించే అవకాశం ఉంది. మహా సిమెంట్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు కూడా స్ధానం కల్పిస్తారని తెలుస్తోంది. మహిళా కోటాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి చోటు దక్కుతుందని సమాచారం. ఏదేమైనా జ‌గ‌న్ టీడీపీ పాల‌క మండలి ఏర్పాటు ఇప్పుడు ఏపీలో మ‌రిన్ని నామినేటెడ్ ప‌ద‌వులు ఆశిస్తోన్న వారిలో జోష్ నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: