భారత దేశ ప్రజలంతా భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా ఐక్యమత్యంతో జీవించాలని భావించి, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వివిధ సంస్థానాలను దేశంలో అంతర్భాగం అయ్యేలా కృషిచేశారు. ఆ మహానుభావుడి కృషికి కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ లోని కెవడియా ప్రాంతంలో, నర్మద నది పై 2989 కోట్ల రూపాయల వ్యయంతో నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే. 


597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా ఈ "ఐక్యత విగ్రహం" రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి మరో ప్రతిష్ట చేకూరింది. ప్రఖ్యాత 'టైం మ్యాగజైన్' ప్రచురించిన "2019లో ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల" జాబితాలో ఐక్యత విగ్రహం చోటు సంపాదించింది. ప్రజలు మెచ్చిన 100 దర్శనీయ స్థలాలను ప్రస్తావిస్తూ ప్రతి సంవత్సరం టైమ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను ప్రకటిస్తుంది. 


ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా సందర్శించిన పార్కులు, హోటల్ లు, మ్యూజియంలు మరియు పర్యాటక ప్రాంతాలను ఈ జాబితాలో ప్రకటిస్తారు. జాబితాలో ప్రస్తావించిన స్థలాలను వాటి వాస్తవికత, నాణ్యత, స్థిరత్వం, ఆవిష్కరణ మరియు ప్రభావం వంటి కొన్ని ప్రమాణాల ఆధారంగా అంచనా వేశారు. కాగా సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించిన ఈ ఐక్యత విగ్రహాన్ని రోజు పది వేల మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: