అమరావతి లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు అడుగు ముందుకు పడటం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అంతుచిక్కకుండా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు తీసుకు వెళ్ళే అంశంపై స్పష్టత లేకుండా తయారైంది.మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్‌ మదిలో ఏముందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుల విషయంలో సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇటీవల జరిగిన ప్రపంచ దేశాల సమ్మిట్‌లో విశాఖ, విజయవాడతో పాటు గుంటూరులకు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని ప్రస్తావించారు. దీనిని బట్టి చూస్తే ఈ రంగంలో ఆయన ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించారని తెలుస్తోంది. మెట్రోలు ప్రభుత్వ భాగస్వామ్యంతో చేస్తే లాభసాటిగా మారటానికి పదిహేనేళ్ళు అయినా పడుతుంది. ఈ క్రమంలో ప్రైవేటుకు అప్పగించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పై సచివాలయంలో జరిగిన స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అధ్యయనం పేరుతో హోల్డ్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.20 వేల కోట్లకు పైగా వ్యయ అంచనాతో డీపీఆర్‌ రూపొందించటాన్ని సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించినట్టు సమాచారం. ఇన్ని వేల కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు వడ్డీ కూడా తోడైతే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నట్టు సమాచారం. స్టీరింగ్‌ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. లోపల జరిగిన వివరాలను స్టీరింగ్‌ కమిటీ బయట పెట్టకుండా గుంభనంగా వ్యవహరించింది.
 



కారిడార్‌ - 2 లో భాగంగా పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు సెంటర్‌ వరకు 12.5 కిలోమీటర్ల నిడివిని ప్రతిపాదించారు. కారిడార్‌ - 3 లో భాగంగా రెండు వేర్వేరు ట్రాక్‌ల కోసం 6.3 , 8.2 కిలోమీటర్ల చొప్పున నిడివిని ప్రతిపాదించారు. కారిడార్‌ - 1 లో అమరావతి ప్రాంతంలో 27 కిలో మీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ను ప్రతిపాదించారు. గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ అంటే ఫ్లై ఓవర్‌ మీద ట్రాక్‌ వస్తుంది. కారిడార్‌ - 2 లో బందరు రోడ్డుపై ఎలివేటెడ్‌ తో పాటు, ఎర్త్‌గ్రేడ్‌ ప్రతిపాదనలు కూడా చేశారు.
 



కారిడార్‌ - 3 లో ఎర్త్‌గ్రేడ్‌ ప్రతిపాదనలు ఎక్కువుగా ఉ న్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అవసరమైతే ప్రాధాన్యతా క్రమంలో కారి డార్లను కుదించుకుని అవసరమైన చోటే ముందుగా తలపెట్టవచ్చు. దీనివల్ల గణ నీయంగా వ్యయం తగ్గుతుంది. మొత్తం కారి డార్లన్నీ డీపీఆర్‌లో చూపినట్టుగా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. విస్త రించుకుంటూ చేయవచ్చు. ఢిల్లీలో ఇప్పటికే మెట్రోను విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఇక్కడ కూడా చేయవచ్చు. ఇప్పటికే అమ రావతిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేయటం,.. నూతన రాజధాని భవిష్యత్తు ఏమిటన్నది గందరగోళంగా మారింది. అమరావతి అంటే ఆక్షేపిస్తున్న మంత్రి బొత్స అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కూడా ఉంచుతారా? రద్దు చేస్తారా? అన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.




వాస్తవంగా చూస్తే.. ఇది దశల వారీగా చేపట్టే ప్రాజెక్టు వ్యయం. మొదటి ఫేజులో చేపట్టే వ్యయం ఇంత ఉండదు. పోనీ వ్యయం అవుతుంది అనుకుంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ మేరకు పూర్తి సహాయ సహకారాలను కోరవచ్చు. ప్రత్యేక హోదా ప్రకారం చూసినా, ప్రత్యేక ప్యాకేజీ ప్రాతిపదికన చూసినా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర సహాయాన్ని కోరవచ్చు! ఇవన్నీ ప్రత్యామ్నాయాలు ఉండగా.. డీపీఆర్‌ ఖరీదుగా ఉందని ప్రభుత్వం భావించటం విడ్డూరంగా ఉంది. ఒకసారి శిస్ర్టా రూపొందించిన డీపీఆర్‌ను పరిశీలిస్తే.. కారిడార్‌ -1 లో భాగంగా గన్నవరం బస్‌స్టేషన్‌ నుంచి ఎయిర్‌ పోర్టు మీదుగా రామవ రప్పాడు రింగ్‌ ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్‌ ఆ తర్వాత బస్‌స్టేషన్‌ ఇక్కడి నుంచి క్రిష్ణా కెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతి , లింగాయపాలెం వరకు 55.5 కిలోమీటర్ల నిడివిని ప్రతిపాదించారు.
 

 


వాస్తవానికి మూడు నెలల కిందటే కన్సల్టెన్సీ సంస్థ తుది డీపీఆర్‌ను సిద్ధం చేసినా నూతన ప్రభుత్వం కొలువు తీరాక దీనిపై చర్చించేందుకు రెండు నెలలకు పైగా తాత్సారం చేసింది. స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) అధికారులు గప్‌చుప్‌గా ఉండటంపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని దీనిని భారంగా మంత్రి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఈ ప్రాజెక్టుకు రుణం ఇవ్వాల్సి ఉంది. సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిథులు కూడా పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టుకు, కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ రుణం ఇస్తే వేలాది కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందన్న ఆలోచనలో మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: