విశాఖ తో నాకు  అనుబంధం ఉన్నది

 తాను ఆంధ్ర  యూనివర్సిటీ పూర్వ విద్యార్థి  అని ఈ నగరంతో తనకు కూడా మంచి అనుబంధం ఉన్నదని  భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు చెప్పారు.  ఎన్ ఎస్ టి ఎల్ ఎల్. అర్ధ శతాబ్ది వేడుక లో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి  గతాన్ని నెమరు వేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను ఇక్కడే జైలు జీవితం గడిపినని  అక్కడే తన రాజకీయ జీవితానికి బీజం పడిందని కూడా ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు అన్నారు. విశాఖ నగరం చాలా అద్భుతంగా ఉంటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం  ఎంతోమంది గొప్ప గొప్ప వారికి విద్యను అందించింది అని కొనియాడారు.



భారత నావికా దళం లో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ  వారి పాత్ర అ ఎంతో కొనియాడదగినది, దేశ రక్షణ వ్యవస్థ లో ఈ సంస్థ జరిపిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని  దీనివలన మన మన రక్షణ వ్యవస్థ మరింత దుర్భేద్యంగా తయారైందని కూడా శ్రీ వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని,  తను కూడా ఈ మంచి కార్యక్రమం లో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.



ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నఉపరాష్ట్రపతి  శ్రీ వెంకయ్యనాయుడు గారికి రాష్ట్ర పర్యాటక, సంస్కతిక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, తూర్పు నావికాదళం వైఎస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌, డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి,  తదితరులు ఘన స్వాగతం పలికారు.



మరింత సమాచారం తెలుసుకోండి: