ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని అంశాల్లో ఎవరు ఊహించని విధంగా జగన్ షాకింగ్ డెసిషన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం పంపిణీలో కోత పెట్టడం కోత పెట్టడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాదికి మూడు జతలు యూనీఫాం పంపిణీ చేస్తోంది.


అయితే జగన్ ప్రభుత్వం ఇక నుంచి రెండు జతల యూనిఫాం మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ రెండు చేతులకు అయ్యే ఖర్చు విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక జత దుస్తులు పంపిణీ చేయగా త్వరలో మరో రెండు జతల దుస్తులు వస్తాయని విద్యార్థులు ఆశతో ఉండగా... ప్రభుత్వ నిర్ణయం వారికి షాక్ ఇచ్చినట్లు అయింది. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా యూనిఫాం పంపిణీలో జరిగిన జాప్యంతో విద్యార్థులు తరగతుల‌ ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. క్వార్టర్లీ పరీక్షలు కూడా త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికీ ఇంకా యూనిఫాం పంపిణీ కాకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. గత ఏడాది నుంచి సరుకులు సకాలంలో పంపిణీ చేసిన వారు మాత్రం పూర్తి చేయలేదు. దీంతో విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి చివరి వరకు దుస్తులు పంపిణీ చేస్తూ ఉన్నారు.


దీనికితోడు కుట్లు నాసిర‌కంగా ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ ఏడాది తల్లిదండ్రులకు కుట్టు బాధ్యతలు అప్పగించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా యూనిఫాం పంపిణీలో కోత‌ పెట్టడంతో విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రభుత్వం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: