జగన్ ఏపీకి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. పైగా యువకుడు. మొదటిసారి అధికారం దక్కింది. ఎన్నో ఆశలు, మరెన్నో ఆక్షలు ఆయనకు ఉన్నాయి. తాను ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నది జగన్ ఆరాటం. అయితే జగన్ ఆలోచనలకు, ఆశయాలకు తగిన విధంగా పాలన సాగుతోందా. జగన్ కి అన్ని వైపుల నుంచి అనుకూలత ఉందా. పాలనారధం సజావుగా సాగుతుందా.


ఈ ప్రశ్నలకు ఏపీ ఆర్ధిక శాఖ అధికారులు ఇచ్చిన సమాధానం వింటే షాక్ తగుతులుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి అధికారులతోనిర్వహించిన   సమావేశంలో జగన్ కి   ఖజానా యొక్క భయంకరమైన చిత్రాన్ని అధికారులు అ అందచేయడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారట. గత నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల అధికారుల ఆదాయం బాగా పడిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి చెబుతూంటే జగన్ నిలువునా నీరైపోయాని టాక్.


ఇక వాణిజ్య పన్నుల వాటా  ఈ ఏడాది 14 శాతం పెరుగుదలను వారు అంచనా వేసినప్పటికీ అది 5.3 శాతం తగ్గింది. పన్ను ఆదాయానికి ప్రధాన కారణం నిర్మాణ కార్యకలాపాలు లేకపోవడం, ఫలితంగా ఇనుము, ఉక్కు మరియు సిమెంట్ అమ్మకాలు తగ్గాయి. ఇది వారి రేట్లు తగ్గడం, రాష్ట్ర ఆదాయాన్ని ప్రభావితం చేసింది. అదేవిధంగా, అమ్మకాలు బాగా పడిపోవడంతో ఆటోమొబైల్ రంగంలో తిరోగమనం ఉంది. ఇది మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే జీఎస్టీలో బాగా పడిపోయింది. 


అయితే కేంద్రం నుంచి జీఎస్టీలో రాష్ట్ర వాటా కేవలం రూ .597 కోట్లు ఉంటుందని అంచనా. రాబోయే నెలల్లో వాణిజ్య పన్ను ఆదాయంలో 14 శాతం పెరుగుదల ఉండవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ మరియు ఇతర రంగాల నుండి బాగా పడిపోయిన ఆదాయాలు సంవత్సరం చివరినాటికి మెరుగుపడతాయి. ఇలా కొన్ని ఆశావహమైన సమాచారం ఉన్నా సరే జగన్ కి అధికారులు చూపించిన ఆర్ధిక చిత్రం మాత్రం దారుణంగానే ఉందంటున్నారు.


దాంతో జగన్ తలపెట్టిన భారీ పధకాలకు నిధులు నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. నవరత్నాలు అమలు చేయాలంటే మొత్తం బడ్జెట్లో లక్ష కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. మరో వైపు అభివ్రుధ్ధి కార్యక్రమాలు చూడాలి. దీర్ఘకాలిక పధకాలు, ప్రాజెక్టులు ఎటూ ఉన్నాయి. ఆర్భాటంగా రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆర్ధిక పరిస్థితి మాత్రం కుదేల్ అయింది


 దీంతో జగన్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిగా  ఉందని అంటున్నారు.  ఇక కేంద్రం శరణం గత్యామీ, అదీ వీలుకాకపోతే అప్పులు తేవడం ఒక్కటే మార్గంగా ఉంది. ఇంతకీ మొత్తానికి మొత్తం అప్పులు చంద్రబాబు చేసేశాక జగన్ కి పైసా అయినా అప్పు పుడుతుందా అన్నది ఒక పెద్ద డౌట్.


మరింత సమాచారం తెలుసుకోండి: