చంద్రయాన్‌ -2 మిషన్‌ సక్సెస్‌ఫుల్ గా చంద్రుడివైపు సాగుతోంది. ఇస్రో చేపట్టిన ఈ ప్ర‌యోగం ఒక్కొక్క ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంటోంది. చంద్రుడి మీదకు దిగే ప్రక్రియ ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఇవాళ ఉదయం కూడా చంద్రయాన్‌ 2ను చంద్రుడికి మరింత దగ్గర చేసే ప్రక్రియను చేపట్టారు. చంద్రయాన్‌-2 క్లోజర్‌ను 4 వేల 300 కిలోమీటర్ల నుంచి 14 వందల 11 కిలోమీటర్ల వరకు ఉన్న మూన్‌ సర్ఫెస్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఈనెల 30న మరోసారి ఇలాంటి ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ రోజు.. 14 వందల 11 కిలోమీటర్ల నుంచి 164 కిలోమీటర్లకి దగ్గరగా తీసుకుపోనున్నారు.


జులై 22న నెల్లూరులోని సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చంద్రయాన్‌ 2ను విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. సెప్టెంబర్‌ 7న ల్యాండర్‌ మూన్‌పై ల్యాండ్‌ కానుంది. జులై 22న చంద్రయాన్-2 ప్రయోగం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రక్రియలను సక్సెస్‌ఫుల్‌గా శాస్త్రవేత్తలు  పూర్తి చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఇదిలాఉండ‌గా, చంద్రయాన్‌ 2 తీసిన భూమి ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. 


ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిని చంద్రయాన్ 2 ఉపగ్రహం  ఇప్పుడు మరో రెండు ఫొటోలను పంపింది. చంద్రుడిపై జాక్సన్, మాచ్, కొరోలెవ్, మిత్రా అనే నాలుగు బిలాలను గుర్తించినట్లు ఇస్రో ట్విటర్ ద్వారా వెల్లడించింది. జాక్స‌న్ లోయ చంద్రుడి ఉత్త‌ర ద్రువం వైపున ఉండగా, సుమారు 71.3 కిలోమీటర్ల వెడ‌ల్పుతో ఉన్నట్లు తెలిపింది. ఇక మిత్రా క్రేటర్ సుమారు 92 కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో ఉన్నట్టు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23,2019న 4,375 కిలో మీటర్ల ఎత్తు నుంచి టెరాన్ మ్యాపింగ్ కెమెరా -2 ద్వారా చంద్రయాన్ ఆ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: