కోడెల శివ ప్రసాద్ గత ప్రభుత్వంలో చేసిన కక్కుర్తి పనులు, అవినీతి ఇప్పుడు తన మెడకు చుట్టుకున్నాయి. ఇప్పటికే ఫర్నిచర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును కోడెల ఆశ్రయించారు. మొత్తం 14 కేసుల్లో 5 కేసుల్లో కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే కోడెల చెబుతూ నా మీద రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని చెప్పారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది మాట్లాడుతూ 5 ఏళ్ళు ఫర్నిచర్ ను వాడుకొని ఇప్పుడు డబ్బులు కడతామని చెప్పడం చట్ట విరుద్దమని, ప్రభుత్వ ప్రొపెర్టీని స్వంత అవసరాల కోసం వాడుకోవటం చట్ట వ్యతిరేకం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే మరి కొన్ని కేసుల్లో కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. 


అయితే టీడీపీ అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే కోడెల మళ్ళీ స్పీకర్ స్థానంలో చేతివాటం ఇంకా ఎక్కువయ్యేది. అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు కూడా నమోదు చేసారు. మాజీ స్పీకర్ అయ్యి ఉండి ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.


 ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో ! అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా ! అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: