మారుతున్న టెక్నాలజీని అన్ని రంగాలు అందిపుచ్చుకుంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే రోబోలను చాలా రంగాలు రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో రోబోలను రెస్టారెంట్లలో వినియోగిస్తున్నారు. రోబోల వినియోగంతో ఆ రెస్టారెంట్లకు కూడా మంచి పేరు వస్తోంది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో కూడా రోబోలను వినియోగించుకోబోతున్నారని తెలుస్తుంది. 
 
ఐసీఐసీఐ బ్యాంక్ నోట్లను లెక్క పెట్టటం కొరకు రోబోలను వినియోగించుకోబోతున్నట్లు నిన్న ప్రకటించింది. దేశంలో తొలిసారి బ్యాంక్ ఈ విధంగా రోబోలను బ్యాంకింగ్ పనుల కోసం నియమించుకుంటుంది. రోబోలు నోట్లను లెక్కపెట్టటం ద్వారా నోట్ల లెక్కింపు వేగవంతంగా పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ 14 రోబోలను నియమించుకున్నట్లు దేశ వ్యాప్తంగా 12 నగరాల్లో ఈ రోబోల సేవలను వినియోగించుకోబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం ఈ రోబోలను బెంగళూరు, ముంబై, ఛండీఘర్, జైపూర్, ఢిల్లీ, మంగళూరు, సంగ్లీ, భోపాల్, హైదరాబాద్, వారణాసి, సిలిగురి, రాయ్ పూర్ నగరాల్లో ఉపయోగిస్తారని సమాచారం. ఈ రోబోలలో రద్దైన పాత నోట్లను కనిపెట్టే ఫీచర్ కూడా ఉందని తెలుస్తోంది. ఈ రోబోలు నోట్ల యొక్క నాణ్యతను బట్టి విడి విడిగా వేరు వేరు ట్రేలలో ఉంచుతాయి మరియు నోటు యొక్క నాణ్యతను బట్టి నోటు చెలామణి అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా కనిపెడతాయని తెలుస్తుంది. 
 
రోబోలను బ్యాంకింగ్ రంగంలో వినియోగించటం వలన పనులు వేగంగా జరగటంతోపాటు సమయం ఆదా అవుతుందని తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం మిగతా బ్యాంకులు కూడా ఈ దిశగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోబోల వినియోగం ద్వారా బ్యాంకులలో జరిగే లావాదేవీల విషయంలో కూడా ఎలాంటి తప్పులు జరగవని తెలుస్తోంది. అన్ని బ్యాంకులలో ఇలాంటి రోబోలను వినియోగిస్తే కస్టమర్లకు కూడా బ్యాంక్ లావాదేవీలు తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: