2014 వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి, జగన్ ఓడిపోవడానికి మధ్య 5శాతంఓట్లు మాత్రమే.  ఆ ఐదు  శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడటానికి కారణం పవన్ కళ్యాణ్.  2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, రాష్ట్రం విడిపోవడంతో.. రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలి కాబట్టి బాబుకు సపోర్ట్ చేశారు.  అవసరమైతే అప్పుడే పోటీ చేసి ఉంటె పవన్ కళ్యాణ్ తప్పకుండా  ఎమ్మెల్యేగా గెలిచేవారు.  


కావాలని అనుకుంటే 2014లోనే మంత్రి పదవిని దక్కించుకునేవారు.  కానీ, పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేదు.  తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు.  పవన్ ప్రచారం కారణంగా టిడిపికి కావాల్సిన 5శాతం ఓట్లు వచ్చాయి.  ఆ ఓట్లతోనే టిడిపి అధికారంలోకి వచ్చింది.  అప్పట్లో రాజధాని విషయంలో పవన్ కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడారు.  ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల వద్ద నుంచి భూములను బలవంతంగా లాగేసుకుంటున్నారు అని బాబును విమర్శించారు.  


బాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని చెప్పి టిడిపితో తెగతెంపులు చేసుకున్నారు.  ఎన్నికల్లో ఎవరికీ వారుగా పోటీ చేశారు.  ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న బాబు కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. పవన్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.  అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధాని విషయంలో  ఆచి తూచి అడుగులు వేస్తున్నది.  రాజధాని విషయంపై బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.  రాజధానిని మారుస్తున్నారని అందరూ కంగారు పడుతున్నారు.  


రాజధానిని  మార్చాలని చూస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది అన్నట్టు పవన్ మాట్లాడారు.  అటు బాబుగారు రాజధాని విషయంలో  జరిగితే దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మాటలు ఒకేలా ఉండటంతో.. ఇద్దరు కలిసి రాజాధాని విషయంలో ఫైట్ చేశారేమో అనే టాక్ వస్తోంది.  రాజధాని విషయంలో మాత్రమే కలిసి పనిచేస్తారా లేదంటే.. అన్ని మిగతా విషయాల్లో కూడా కలిసి పనిచేస్తారా చూడాలి.  వచ్చే ఎన్నికల నాటికీ ఇద్దరు కలిసిపోయి పోటీ చేస్తే ఇంకాస్త బలం పుంజుకునే అవకాశం ఉంటుంది.  చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: