మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ ఎస్ సిద్ధమవుతుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఎన్నికలను ఏమాత్రం ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ జనరల్ సెక్రెటరీలతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో కోర్టు నుంచి ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు వచ్చేంత వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి సారించాలని కేటీఆర్ నేతలకు ఆదేశించారు.


మరోవైపు ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. ప్రస్తుతం పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ నెల ముప్పై ఒకటి వరకు కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించిన కేటీఆర్ మునిసిపల్ ఎన్నికల కోసం పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జీలను కూడా నియమించారు. పార్లమెంటు నియోజక వర్గాలకు ఒక్కో జనరల్ సెక్రెటరీని ఏర్పాటు చేశారు. ఇక భువనగిరి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఇద్దరిని నియమించారు. ప్రతి పక్ష పార్టీలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. రెండు వేల పధ్ధెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్ ల తరువాత, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ల తరువాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎన్నికలకు వెళ్ళాళి అంటేనే ఒక భయమైన పరిస్థితి వచ్చింది.


అందుకే ఏదో సాకుతో ఇవాళ విమర్శించటం గానీ కోర్టుకు వెళ్లడం గాని రకరకాల విద్యలతో వీటిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ ఒక ఎంపీ నో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో లేక పార్టీ నాయకుల్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి కోర్టుకెళ్ళి తద్వారా ఈ ఎన్నికల నుంచి పారిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ రోజు కేటీ రామారావు గారు మాకు సూచనలివ్వడం జరిగిందని టీఅర్ ఎస్ లీడర్ తెలియజేశారు. ఒక వైపు బిజెపి కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ప్రధాన కార్యదర్శులకు సూచించారు.


పలు నియోజక వర్గాల్లో ఉన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దాల్సిన బాధ్యత ఇన్ చార్జి నేతలకూ అప్పగించిన కెటిఆర్ పాత కొత్త నేతలను కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక కమిటీల ఏర్పాటు పూర్తి కాగానే నియోజక వర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న టీఆర్ ఎస్, అత్యధిక స్థానాలు గెలిచి అటు కాంగ్రెస్ ఇటు బిజెపికి చెక్ పెట్టాలని భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓ లెక్క, పార్లమెంట్ ఎన్నికల తరవాత మరో లెక్క అంటున్నారు బీజేపీ అధ్యక్షుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: