ఢిల్లీ టిటిడి టెంపుల్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. టీటీడీ టెంపుల్ కార్యాలయం నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. ఢిల్లీ శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఐదు కోట్ల నిధుల దుర్వినియోగం టిటిడిలో అట్టుడుకుతుంది. ధార్మిక కార్యక్రమాల పేరుతో అవినీతి జరిగినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ లోకల్ అథారిటీ చైర్మన్ ప్రవీణ్ ప్రకాష్ వైపే అందరి వేళ్లూ చూపెట్టాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఢిల్లీ లోని టీటీడీ టెంపుల్ నిర్వహణ నిధుల దుర్వి నియోగం ఆరోపణలపై ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల స్పందించారు.


లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా ఆమోదించే అవకాశం లేదన్నారు. అక్రమాలు జరిగాయని భావించటం లేదన్నారు సింఘాల్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతుందన్నారు. మరోవైపు టిటిడి తీరుపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కానుకల దుర్వినియోగం పై దర్యాప్తు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం పై బిజెపి నాయకులు తిరుపతి అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


దీంతో ఎట్టకేలకు టిటిడి టెంపుల్ కార్యాలయం నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ బ్రహ్మోత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఐదు కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టుగా టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీని పై విచారణ జరపాల్సిందిగా టిటిడి విజిలెన్స్ అధికారులను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఢిల్లీ వెళ్లి విచారణ జరిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: