తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమంలో మహిళలు పాల్గొనే విధంగా కవిత చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి కవిత రాజకీయాల్లో బిజీగా మారిపోయింది.  2014లో జరిగిన ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నియోజక వర్గం నుంచి పార్లమెంట్ కు ఎంపికైంది.  ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కవిత అనేక హామీలు ఇచ్చింది.  అయితే ఇచ్చిన హామీలను ఆమె నిలబెట్టుకోలేకపోయింది.  అప్పటి నుంచి కవితను నిజామాబాద్ ప్రజలు విస్వసించడం మానేశారు.  


ఆ తరువాత కవిత 2019 లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమిపాలైంది.180 రైతులు కవితకు వ్యతిరేకంగా నిలబడటంతో ఆమెకే ఓటమి తప్పలేదు.  కవిత ఓటమి పాలయ్యాక, ఆమెకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని తెరాస భావించింది.  కానీ కవిత మాత్రం దానికి ససేమిరా అనడంతో పార్టీకి ఏం చేయాలో తోచలేదు.  అయితే, పార్టీ ఇప్పుడు ఆమెకు కొన్ని కీలక పదవులు ఇవ్వబోతున్నారు.  కవితను ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేయడం, లేదా మంత్రి వర్గ విస్తరణలో కేటీఆర్ కు మంత్రి పదవిని కట్టబెట్టి కేటీఆర్ నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇవ్వాలని చూస్తున్నారు.  


ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  హరీష్ రావును కాదని కెసిఆర్ తన సొంత బిడ్డలకు న్యాయం చేసుకుంటున్నాడు.   ఇది చాలా మందికి నచ్చడం లేదు.  తెరాస పార్టీ పుట్టినప్పటి నంచి తెరాస పార్టీతోనే హరీష్ రావు ఉన్నారు.   ఉద్యమ సమయంలో కేటీఆర్ యూఎస్ లో ఉద్యోగం చేస్తున్నారు.  తెరాస పార్టీ కుదురుకున్నాక కేటీఆర్, కవితలు పార్టీలోకి వచ్చారు. కాగా, ఈ సమయంలో హరీష్ రావును పక్కన పెట్టడం అంటే తెరాస పార్టీ తన పతనాన్ని కోరుకున్నట్టే అని కొందరి అభిప్రాయం.  


దసరాను పురస్కరించుకొని తెరాస పార్టీ మంత్రివర్గం విస్తరణను చేపట్టబోతున్నది.  ఈ విస్తరణలో భాగంగా కేటీఆర్ కు పదవి లభించడం ఖాయం అని అంటున్నారు.  ఒకవేళ కేటీఆర్ కు పదవి లభిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాళి అవుతుంది.  అలా కాకుండా, కేటీఆర్ కు పదవి ఇవ్వని పక్షంలో కవితకు ఆ అవకాశం రావొచ్చు.  తెరాస ప్రభుత్వంలో మహిళలు లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.  ఈ విమర్శలకు చెక్ పెట్టాలి అంటే మహిళలను తీసుకోవలసిందే. మరి కెసిఆర్ మదిలో ఎలాంటి ఆలోచన ఉన్నదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: