సాధారణంగా కొంత మంది అతి తెలివి అవతలి వారిని కడుపుబ్బా నవ్వించడమే కాదు..అలాంటి తప్పులు ఎలా చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు.  ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల తప్పిదాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. హాల్ టికెట్స్ పై సినీ, రాజకీయ సెలబ్రెటీల ఫోటోలు పెట్టడం..ఓటరు కార్డుపై సినీ, క్రీడాకారుల ఫోటోలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే అవి కంప్యూటర్ మిస్టేక్ అని ఒక ఫోటోకు బదులు మరో ఫోటో అప్ లోడ్ అయ్యిందని కొట్టి పడేస్తుంటారు. 

కానీ విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తెలిసి చేశారో..తెలియక చేశారో కానీ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఫోటో పెట్టి ఒకప్పటి పరుగుల రాణి పిటి ఉషా పేరు రాశారు.  ప్రస్తుతం భారత దేశంలో క్రికెట్ తర్వాత టెన్నిస్, బ్యాట్ మెంటన్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు..బంగారు పథకాలు తీసుకు వస్తున్నారు.

అలాంటి వారి పేరు ఎవ్వరికైనా తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సానియా మిర్జా ఫోటో పెట్టి పిటి ఉష పరుగుల రాణి పేరు పెట్టడం ఒకంత ఆశ్చర్యం వేసినా కనీస జ్ఞానం ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి.  ఎవరిదైనా ఫ్లెక్సీ పెట్టే సమయంలో చాలా వరకు పేర్లు, డిజిగ్నేషన్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని మరీ పెడుతుంటారు.

విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తప్పిదాలు నవ్వుల పాల్జేశాయి. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫొటో ముద్రించిన బ్యానర్‌పై మాజీ అథ్లెట్‌ పీటీ ఉష పేరు రాయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా దినోత్సవం సందర్భంగా బీచ్‌రోడ్డులో మంత్రి అవంతి శ్రీనివాస్‌ క్రీడా ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఈ ఫ్లెక్సీ చూసి విస్తుపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: