ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో ... వైసీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా ... కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సరిగ్గా దక్కించుకోలేక దారుణ పరాజయాన్ని చవి చూసింది టీడీపీ .దీంతో పార్టీ లో నేతలు ఉంటారా ఉండతారా అనే అయోమయంలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఉంది . ఎలెక్షన్లలో గెలవటానికి ఎన్నో వ్యూహాలను రచించిన మాస్టర్ మైండ్ చంద్రబాబు ... ఊహించని విదంగా పరాజయం ఎదురవటం తో అయోమయంలో పడ్డారు .


ఆ అయోమయంలోనే అసలు ఓటమికి కారణం ఏంటో అని ఆలోచిస్తున్న తరుణంలో ... సీఎం జగన్ బాబుకి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.కాగా తాజా పరాజయంతో పార్టీ ముఖ్యనేతలు కూడా టీడీపీ నుండి బీజేపీ లోకి వెళ్లిన విషయం తెలిసిందే . ఈ తరుణంలో బాబు చూపు తెలంగాణ వైపు మళ్లింది అంటూ కొత్తగా వార్తలు వెలువడుతున్నాయి .

ఇందుకు కారణం కూడా లేకపోలేదు .. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో  అమరావతిలో చంద్రబాబుతో   సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రము వేరయ్యాక కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే బాబు పరిమితం అయ్యారు.  ఎదో చుట్టపు చూపుగా తప్పా ... తెలంగాణ టీడీపీ గురుంచి పూర్తి స్థాయిలో ఆలోచించలేదు . దీంతో తెలంగాణాలో టీడీపీ పరిస్థితి  దాదాపు అయిపోయినట్టే అనిపించినా ...తాజాగా టీడీపీ నేతల సమావేశం తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి . మరి నిజంగానే బాబు తెలంగాణ టీడీపీ పై ద్రుష్టి పెట్టాలనుకుంటున్నారా అంటే ... అది చాల కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .తెలంగాణాలో  ఇప్పటికే కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్న టీడీపీ ని గాడిలో పెట్టడం కష్టం తో కూడుకున్న పనే . అంతే కాకుండా   ప్రస్తుతం టీడీపీ  పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ బలోపేతం చేయటం ముఖ్యం కాబట్టి. బాబు తెలంగాణ టీడీపీ పై ద్రుష్టి పెట్టె అవకాశమే లేదంటున్నారు .రాజకీయ విశ్లేషకులు . మరి చంద్ర బాబు తెలంగాణ టీడీపీ నేతల తో భేటీ వెనుక వ్యూహం ఏంటో అంతుచిక్కటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: