రాజకీయాల్లో వ్యక్తులను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదని ఆయన్ని విమర్శించేవారు చెబుతున్నమాట. ఇందుకు వారు అనేక ఉదాహరణలు చూపిస్తుంటారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్..ఇలా ఈ జాబితా చాలా పెద్దదనే అంటుంటారు.


ఇప్పుడు ఆ జాబితాలో బాల‌య్య చిన్నల్లుడి పేరు కూడా చేరిపోయిందని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పై దుష్ప్రచారం కోసం బాల‌య్య తన చిన్నల్లుడు భరత్ ను అస్త్రంగా వాడుకున్నాడని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ కథనం సర్క్యులేట్ అవుతోంది.


ఆ కథనం ఇలా ఉంది..

“ జూనియర్ కు బదులుగా బాలయ్య చిన్నల్లుడు భరత్‌ను నెమ్మదిగా తెర మీదకు లాగాడు. పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ వివాదాస్పద వాఖ్యలు చేయించాడు. దీంతో బాలయ్య చిన్నల్లుడు భరత్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాజిటివ్ గా, నెగిటివ్‌ గా భరత్ పేరు ప్రజల నోళ్లలో నానేలా చేయడమే బాబు వేసిన ప్లాన్. ఎంపీగా గెలవలేకపోయిన భరత్ ను పార్టీకి కొత్త ఆశగా చూపించి తెరవెనుక తాను, తన కొడుకు తతంగం నడపాలన్నదే కొత్త స్కెచ్ లా కనిపిస్తోంది.


ఒకప్పుడు ఎన్టీఆర్‌ ను గద్దె దించేందుకు హరికృష్ణను, తోడల్లుడు వెంకటేశ్వరరావును ఇలాగే వాడుకుని తర్వాత పక్కన పెట్టిన విషయం ఒకప్పటి నందమూరి అభిమానులు మరిచిపోలేరు. తాజాగా తెలంగాణా ఎన్నికల్లోనూ హరికృష్ణ సింపతీని వాడుకునేందుకు ఆయన కుమార్తె సుహాసిని బరిలోకి దింపాడు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఆమె పట్టుమని పది మాటలు కూడా మాట్లాడలేక దారుణంగా ఓడిపోయింది. ఇలా తన రాజకీయ అవసరాల కోసం నందమూరి కుటుంబంలో ఎవ్వరో ఒకరిని బలిపశువులను చేయడం బాబుకు ఆనవాయితీ. పాపం నందమూరి ఇంటికి అల్లుడైన కారణంగా ఈ సారి ఆ అదృష్టం బాలయ్య చిన్నల్లుడిని వరించిందన్నమాట.” మరి ఈ కథనంలో వాస్తవమెంతో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: