ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా ఇండియాకు సపోర్ట్ చేసింది.  జమ్మూ కాశ్మీర్ సమస్య ఇండియా అంతర్గత విషయం అని చెప్పింది.  అయితే, ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఇండియా, పాకిస్తాన్ లు కల్సి కూర్చొని చర్చించుకోవాల్సిన అంశం అని, దాని విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.  జి 7 దేశాల సదస్సులో మోడీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను కలిసిన తరువాత సంయుక్తంగా చేసిన ప్రకటన ఇది.  


ఇలాంటి ప్రకటిన చేసిన కొద్దిరోజులకే జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం ఎంతవరకు సబబో అర్ధం కావడం లేదు.  జి 7 సదస్సులో అలాంటి వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా అమెరికా తిరిగి ఇలా మాట్లాడటం ఎందుకో తెలియడం లేదు.  అయితే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే.. కాశ్మీర్ సమస్యను దైపాక్షికంగా చర్చించుకోవాలని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు.  


అంతేకాదు, బోర్డర్ లో పాకిస్తాన్ సంయమనం పాటించాలని, దూకుడు ప్రదర్శించవద్దని చెప్తున్నది.  ఒకేలా ఏదైనా జరిగి యుద్ధం వస్తే దాని వలన అమెరికాకు ఇబ్బంది కలుగుతుంది.  ఇప్పటికే పాకిస్తాన్, ఇండియాలో అమెరికా బోలెడు ఇన్వెస్ట్ చేసింది. వ్యాపారపరంగా నష్టపోవాల్సి వస్తుంది. బహుశా ఈ కారణంగానే యుద్ధం వద్దని చెప్తున్నది.  


ఇప్పటికే అమెరికా యుద్దాలు చేసి చేసి తీవ్రంగా నష్టపోయింది.  ఇప్పుడు మరలా యుద్ధం అంటే కుదేలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.  అందుకే దీని నుంచి బయటపడటానికి యుద్ధం వద్దని సంయమనం పాటించాలని హెచ్చరిస్తోంది.  ఈ హెచ్చరికలను పాక్ ఖాతరు చేస్తుందా.. అమెరికా ఇండియాకు సపోర్ట్ చేస్తోందని ఇప్పటికే పాక్ కోపంగా ఉన్నది.  పైగా చైనా కూడా అమెరికాతో వైరం ఉన్నది.  ఈ నేపథ్యంలో అమెరికా చెప్పినా పాక్ వినేలా కనిపించడం లేదు.  మరి పాక్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: