ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ యువతీయువకులకు పెళ్లి విషయంలో పూర్తి స్వేచ్ఛ లభించింది.  దేశంలో ఎక్కడి వ్యక్తులైన ప్రేమించవచ్చు.. పెళ్లి చేసుకోవచ్చు.  ఆర్టికల్ రద్దు కు ముందు ఇలా పెళ్లి చేసుకోవడం నేరం.  ఒకవేళ కాశ్మీర్ అమ్మాయిలు వేరే రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలను వివాహం చేసుకుంటే... ఆ అమ్మాయిలు వారి ప్రత్యేక అధికారాలు కోల్పోవలసి వచ్చేది.  దీంతో బయపడి ఎవరు కూడా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపేవారు కాదు.  


అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.  ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు.  ఎక్కడి వ్యక్తులైన వివాహం చేసుకోవచ్చు.  కాశ్మీర్ అబ్బాయి.. రాజస్థాన్ అబ్బాయి ప్రేమించుకొని అక్టోబర్ లో వివాహం చేసుకోబోతున్నారు.  వీరి వివాహానికి పెద్దలు కూడా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, ఆర్టికల్ 370 రద్దు తరువాత మరో ఇద్దరు కూడా ఇలానే వివాహం చేసుకున్నారు.  బీహార్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు కాశ్మీర్ లో వడ్రంగి పని చేస్తుంటారు.  


ఈ ఇద్దరు అన్నదమ్ములు అక్కడి అమ్మాయిలను ఇష్టపడ్డారు.  ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అక్క చెల్లెల్లు.  అక్కడి పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు.  వివాహం చేసుకున్నాక ఆ అమ్మాయిలను తీసుకొని సొంత రాష్ట్రం బీహార్ వచ్చారు.  పాపం అలా వచ్చిన వెంటనే ఆ అమ్మాయి తరపు తల్లి దండ్రులు తన పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు.  దీంతో పోలీసులు వారికి వెతుక్కుంటూ బీహార్ వచ్చారు.  


బీహార్ పోలీసుల సాయంలో ఆ ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నారు.  అయితే, అమ్మాయి తరపున బంధువుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు.  వివాహాం చేసుకున్న అమ్మాయిలు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నది.  విచారణ తరువాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.  ప్రత్యేక అధికారాలు కోల్పోతామేమో అని పాపం వాళ్ళు భయపడుతున్నారు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత అలాంటివి ఏమి ఉండవని తెలియదనుకుంటా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: