ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళను విడదీయడానికి ట్రై చేస్తారు.. లేదంటే మందలించేందుకు ప్రయత్నం చేస్తూ... అది కుదరకపోతే లేపేయడానికి రెడీ అవుతారు.  అలా కాకుండా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే.. ఆ ప్రేమకు ఊరు మొత్తం అండగా నిలబడి పెళ్లి చేయడం అన్నది అరుదైన సంఘటనగా చెప్పొచ్చు.  


అసలు ఇలా కూడా పెళ్లి జరుగుతుందా అని అనుకోవచ్చు.  మాములుగా బీహార్లో అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పెళ్లి చేస్తుంటారు.  ఇది బీహార్లో చాలా ప్రాంతాల్లో జరుగుతుంటుంది.  చాలామంది రౌడీలకు అది వ్యాపారం.  దీని మీదనే ఇటీవలే బాలీవుడ్లో కూడా సినిమా రిలీజ్ అయ్యింది.  దీనిని పక్కన పెడదాం.  అసలు విషయంలోకి ఎంటరైతే.. 


బీహార్లోని మోతీహారి జిల్లాలోని కున్హియా అనే గ్రామం ఉన్నది.  ఆ గ్రామంలో ఓ యువతి పక్క గ్రామంలో ఉన్న యువకుడిని ప్రేమించింది.  వీరి ప్రేమ విషయం ఊర్లో వాళ్లకు తెలిసింది.  అయితే, ప్రేమికులు ఇద్దరు సీక్రెట్ గా కలుసుకోవడం మాట్లాడుకోవడం చేస్తున్నారు.  ఎలాగైనా ఈ ఇద్దరినీ పట్టుకోవాలని అనుకున్నారు గ్రామస్తులు.  దానికోసం పధకం వేశారు.  


అబ్బాయి అమ్మాయిని చూసేందుకు అర్ధరాత్రి కున్హియా గ్రామంలోకి వస్తాడని సమాచారం అందింది.  గ్రామంలోని వారంతా ఆ యువకుడికోసం కాపుకాశారు.  ఊరంతా నిశ్శబ్దం.. ఎక్కడో వీధి చివర ఓ చిన్న లైట్ వెలుగుతుంది.. దూరంగా కుక్కల అరుపు.  అదే సమయంలో ఆ గ్రామంలోకి యువకుడు అడుగుపెట్టాడు.. అమ్మాయి ఇంటిదగ్గరకు రాగానే.. గ్రామంలోని ప్రజలంతా ఆ అబ్బాయిని పట్టుకున్నారు.  దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు.. వెంటనే గ్రామంలో ఉన్న పురోహితుడిని పిలిపించారు. 

అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.  అందుకే సరే అన్నాడు.. అమ్మాయి కూడా ఒకే చెప్పింది.. అంతే అర్ధరాత్రి గ్రామ ప్రజల సమక్షంలో ఇద్దరు ఒక్కటయ్యారు.  ఇదేదో సినిమా కథలా ఉన్నదే అనుకోకండి.. రియల్ స్టోరీనే.  కావాలంటే ఈ కథతో సినిమా తీసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: