ప్రపంచంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. ఉద్యోగం, సెటిల్మెంట్ వంటి వాటితో నిత్యం పరుగులు తీస్తుండటంతో... వయసును మర్చిపోయారు.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. వయసు ఎక్కడో ఉంటుంది.. ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది.  చైనాలో ఇప్పటికే 200 మిలియన్ మంది ఒంటరిగా ఉంటున్నారు.  వెరీ ఒంటరి తనాన్ని పోగొట్టడం కోసం చైనాలో వై999 అనే ట్రైన్ ను ఏర్పాటు చేసింది.  


ట్రైన్ కు ఒంటరి తనానికి సంబంధం ఏంటని షాకవ్వకండి.  అక్కడికే వస్తున్నా.. వై999 లవ్ పర్స్యూట్ అనే ట్రైన్ నిత్యం రాత్రి పూట మాత్రమే ప్రయాణిస్తుంది.  చార్కింగ్ నుంచి అమౌర్ అనే ప్రాంతానికి ఈ ట్రైన్ వెళ్లి తిరిగి వస్తుంది.  మూడేళ్ళ క్రితం ఈ ట్రైన్ సర్వీస్ ప్రారంభం అయ్యింది.  ట్రైన్ సర్వీస్ ప్రారంభం అయ్యాక ఇప్పటి వరకు మూడువేల మంది ఈ ట్రైన్ లో ప్రయాణం చేశారు.  


ట్రైన్ దిగి వెళ్లిపోయిన వాళ్లలో చాలామంది ప్రేమలో పడ్డారు.  కొంతమంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.  ఇంతకీ ఆ ట్రైన్ లో ఏ ముంటుంది.. ట్రైన్ ఎక్కిన తరువాత అందులో ప్రత్యేకత ఏంటి.. తెలుసుకుందాం. ఈ రైలు ప్రయాణం అస్సలు బోరు కొట్టకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. తమకు నచ్చిన వ్యక్తితో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీనివల్ల వారంతా ఎలాంటి బిడియం లేకుండానే కలిసిపోతున్నారు. జర్నీ మొత్తం ఆట పాటలు, మాటల్లో మునిగి పీకల్లోతు ప్రేమలో పడిపోతారు. 


ఇలా ఈ ట్రైన్ లో ప్రయాణం చేసిన చాలామంది వారి అనుభవాలను, అభిప్రాయాలను న్యూస్ వెబ్ సైట్స్ లో పంచుకున్న వాళ్ళు ఉన్నారు.  కొత్తగా ఏర్పడిన పరిచయం కొత్తగా ఉంటుందని.. జీవితంలో ఒంటరిగా ఉన్నామనే భావన కనిపించదని అంటున్నారు.  ఇలాంటి ట్రైన్స్ మనదగ్గర కూడా ఉంటె చాలా బాగుంటుంది కదా.  చైనాలోనే కాదు మనదగ్గర కూడా పెళ్లికాని ప్రసాదులు ఎందరో ఒంటరిగా మిగిలిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: