రాజధాని రైతులపై అపారమైన ప్రేమ ఒలకబోస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సూటిగా కొన్ని  ప్రశ్నలు సంధించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్న పవన్ ముందు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎంఎల్ఏ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఆళ్ళ అడుగుతున్న ప్రశ్నలే చాలామంది జనాలకు ఉన్నవే.

 

ఇంతకీ ఆళ్ళ అడుగుతున్న ప్రశ్నలేమిటంటే చంద్రబాబునాయుడు దగ్గర నుండి ప్యాకేజి అందినపుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్లమీదకు వస్తున్నది వాస్తవం కాదా ? అన్నది మొదటి ప్రశ్న. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎన్నికలకు ముందు పవన్ చెప్పిన మాట అబద్ధమేనా ? అన్నది రెండో ప్రశ్న.

 

ఎన్నికలకు ముందు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడినట్లు పవన్ చేసిన ఆరోపణలు తప్పా ? అన్నది మూడో ప్రశ్న. అప్పుడు చంద్రబాబు అవినీతిపరుడని చెప్పిన పనవ్ మళ్ళీ ఎందుకు ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ? అన్నది నాలుగో ప్రశ్న.

 

రాజధాని ప్రాంతంపై పవన్ కు నిజంగానే అంత ప్రేముంటే ఇక్కడ ఎందుకు పోటి చేయలేదు ? అన్నది ఐదే ప్రశ్న. ఏదో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షానికి ఇచ్చారని అనుకున్నా మరి అభ్యర్ధి విజయానికి ఎందుకు కనీసం ప్రచారానికి కూడా రాలేదు ? అన్నది ఆరో ప్రశ్న. నారా లోకేష్ విజయానికి లోపాయికారీగా పవన్ ప్లాన్ చేసింది నిజంకాదా ? అన్నది ఏడో ప్రశ్న.

 

ఎన్నికలకు ముందు జగన్, పవన్ ఇద్దరు ప్రతిపక్ష నేతలే. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ఓ ప్రతిపక్ష నేత మరో ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసుకోవటం దేశం మొత్తం మీద ఏపిలోనే జరిగింది.  మరి ఆర్కె సంధించిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ దగ్గర సమాధానాలున్నాయా ? అన్నదే ఇపుడు అసలైన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: