తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎందుకు ఆవేశపడ్డారు. ఈ ఆవేశం హఠాత్పరిణామమా లేక ఎప్పట్నించో గూడుకట్టుకొన్న బాధ అన్నీ కలిసి ఇప్పుడు బయటకి వచ్చాయా.? నిన్న కరీంనగర్ జిల్లాలోని తన నియోజకవర్గంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటెల చాలా ఆవేశంగా మాట్లాడారు. ఎంతో సౌమ్యుడిగా కనిపించే ఈటెల లోని ఈ ఆవేశం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఈ ఆవేశం వ్యక్తిగతమా లేక ఇంకెవరైనా ఉన్నారా. క్యాబినెట్ నుంచి తొలగిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈటెల ఆవేశంపై చర్చ సాగుతోంది. అయితే నిన్న సాయంత్రానికే మళ్లీ ఈటెల రాజేందర్ లో మార్పు కనిపించింది. అధిష్ఠానం మాట్లాడటంతో ఈటెల లోని ఆవేశం చల్లబడింది.


ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయకేతనం ఖాయమని అందులో పేర్కొన్నారు ఈటెల. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఆవేశం వెనుక ఉన్న కారణమేంటీ అన్నది మాత్రం టిఆర్ ఎస్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈరోజు పత్రికా ప్రకటనలలో మాత్రం ఆయన చాలా పాజిటివ్ గా స్పందింనినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈటెల రాజేందర్ వెనుక ఏం జరిగింది. ప్రత్యేకంగా సమావేశం కాకపోయినప్పటికీ కూడా నిన్న ఈటెల రాజేందర్ సాయంత్రం హుజూర్ నగర్ లో ఓ పార్టీ చేరికల కార్యక్రమంలో తన ఆవేదన అంతా కూడా వెళ్లగక్కారు.


పార్టీలో కావచ్చు, బయట కావచ్చు తన పై వార్తలకు సంబంధించి తనను క్యాబినెట్ నుంచి తప్పించబోతున్నారని చెప్పి, ఇంకా తాను అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పి, తనకి చాలా వ్యాపారాలున్నాయి అని చెప్పి ఇలా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా రోజుల్నుంచి ఈటెల రాజేందర్ లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తుంది. దాన్నే నిన్న బయటకు వెళ్లగక్కినట్లు తెలుస్తుంది. గడిచిన రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలతో పాటుగా పలు వార్తా పత్రికల్లో కూడా ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించపోతున్నారు అని అనేక లీకులిచ్చారు. సీఎంఓ లో జరుగుతున్న మీటింగ్ లో సంబంధించి, అటు రెవెన్యూ శాఖ చట్టంకు సంబంధించి ప్రత్యేకంగా బయటకు లీకులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: