ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ అయిదేళ్ళ చంద్రబాబు అడ్డగోలు విధానాలకు ఎక్కడికక్కడ చెక్ చెబుతూ వస్తోంది. అనవసర  వ్యయం దుబారా పెడుతూ అస్మదీయులకు అన్నీ పంచి పెడుతూ ఖజానాను గుల్ల చేసిన గత సర్కార్ దాష్టికాలను ఒక్కోటీ బయటకు తెస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా వైసీపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది.


నిన్నటివరకూ టీడీపీలో ఉంటూ రక్షణ కోసం అన్నట్లుగా బీజేపీలోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాంట్రాక్టు పై జగన్ గట్టిగా ద్రుష్టి  సారించారు. బాబుకు సన్నిహితునిగా ఉంటూ అప్పనంగా  దక్కిందుకున్న  గాలేరు-నగరి సుజల స్రవంతి  పనుల కోసం ప్రస్తుత ఒప్పందాన్ని ముగించి రివర్స్ టెండరింగ్ కోసం వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లుగా సమాచారం.


సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్టులకు గాలేరు-నగరి దశ -2 పనుల కాంట్రాక్టు ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు కట్టబెట్టారు. నీటిపారుదల శాఖపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రమేష్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు జగన్ ప్రభుత్వం స్పష్టంగానే గుర్తించింది.  180 కోట్ల విలువైన ప్రధాన కాలువ నిర్మాణానికి సంబంధించిన రెండు ప్యాకేజీలకు సంబంధించిన రెండవ దశలో పనులుగా వీటిని చేపడుతున్నారు.


ఈ ఏడాది  ఫిబ్రవరి 11 న లంప్ సమ్ (ఎల్ఎస్) పద్ధతిలో 391.31 కోట్ల రూపాయలకు టెండర్లకు పిలుపునిచ్చారని అప్పట్లోనే వైయస్ఆర్సి ఆరోపించింది. అప్పట్లో నాలుగు కంపెనీలు బిడ్లు సమర్పించగా, అవసరమైన అర్హతలు ఉన్నప్పటికీ వాటిలో కావాలనే  రెండింటిని  టీడీపీ ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన రెండు కాంట్రాక్ట్ సంస్థలలో - ఎన్‌సిసి, రిత్విక్ ఉంటే  ఎన్‌సిసి రిత్విక్ కంటే ఎక్కువ కోట్ చేసిందని వారిని పక్కన పెట్టి మరీ రమేష్ కంపెనీకి కాంట్రాక్ ఇచ్చేసింది. 


సాధారణ పద్ధతిలో ఈ  టెండర్లు పిలిచినట్లయితే, కనీసం 10 శాతం తక్కువ రేటుకు కాంట్రాక్ట్ ఇవ్వచ్చని  జగ‌న్ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. దీనివల్ల రూ .54.74 కోట్లు ఆదా అయ్యేది. దాంతోనే జగన్ సర్కార్ రంగం సిధ్ధం చేసింది. రివర్స్ టెండరింగ్ కోసం వెళ్ళడం ద్వారా, ప్రభుత్వం భారీ డబ్బు ఆదా చేయగలదు" అని ఒక అధికారి తెలిపారు. అంటే జగన్ చేస్తున్నది కరెక్ట్ అని అర్ధమవుతోంది. మరి బీజేపీలోకి వెళ్ళినా రమేష్ కి రివర్స్ గేర్ తప్పేట్లు లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: