యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా శ్రద్ద కపూర్ కథానాయకగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ తెలుగు చిత్రం సాహూ. బాహుబలి 'ధీ కంక్లూజన్'  సినిమా తరువాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ సాహూ. మొదట్లో ఈ గిఫ్ట్ కోసం తెగ ఆరాట పడ్డారు కానీ అది చివరికి ఆ అభిమానులకు నచ్చక 'ఎం సినిమా రా బాబు' అని అంటున్నారు. 


కొందరు అయితే మరి గోరంగా, అరాచకంగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ నీ సినిమా కోసం దాదాపూ రెండున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా.. కానీ చివరికి నీకు కథ సెలెక్ట్ చేసుకోవడం కూడా రాలేదా.. అసలు అనుభవం లేని డైరెక్టర్ తో సినిమా ఎలా తీసావు నువ్వు అని అంటున్నారు. మరి కొందరు స్పందిస్తూ .. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి నారా లోకేష్ ఏ కారణం అని విరుచుకు పడుతున్నారు. 


అసలు సాహూ కి నారా లోకేష్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ? ఉంది అంది కారణం ఉంది. నారా లోకేష్ మొన్న ఈ మధ్య ఓ ప్రముఖ వార ట్విట్టర్ వేధికగా ట్విట్టర్ లో పత్రికపై కంప్లైంట్ చేస్తూ 'సాహూ సినిమా ప్లాప్ అవ్వాలని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు' అని రాశారని.. ఇలాంటి వార్తలు రాయకండి అని ట్విట్ చేశారని.. నిజానికి అతనికి సాహూ సినిమా చూడాలనుందని అయన ట్విట్ చేశాడు. 


ఆ ట్విట్ వల్లే సినిమా దెబ్బ తినిందని, అందుకే బాగా రాలేదని ఇప్పుడు సాహూ, ప్రభాస్ అభిమానులు విరుచుకు పడుతున్నారు. ఒక వేళా నారా లోకేష్ ట్విట్ చెయ్యక పోయింటే సినిమా బాగా ఆడేదని నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.      
 


మరింత సమాచారం తెలుసుకోండి: